మనం సాధారణంగా ఫైవ్ స్టార్ హోటల్స్ కి వెళ్ళినపుడు వారు ఇచ్చే ఆతిధ్యం, అక్కడి ఫుడ్, వాతావరణం ఎలా ఉంది అని చూస్తాం. అది నచ్చితే మళ్ళీ మళ్ళీ ఆ హోటల్ కే వెళ్ళాలి అనుకుంటాం. అయితే మనం ఎన్ని సార్లు ఫైవ్ స్టార్ హోటల్స్ కి వెళ్లినా ఒక విషయాన్ని గమనించం. అదేంటంటే ఫైవ్ స్టార్ హోటల్స్ లోని రూమ్స్ లో సీలింగ్ ఫ్యాన్స్ ఉండవు. మనం ఇప్పటివరకు ఫైవ్ స్టార్ హోటల్స్ లో మనం ఎక్కువగా ఏసి లు ఉండటమే చూసాం. ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఎక్కువగా సెంట్రల్ ఏసీ లనే వాడుతూ ఉంటారు నిర్వాహకులు.
కానీ అసలు ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఎందుకు ఫ్యాన్స్ ఉండవో ఇప్పుడు తెలుసుకుందాం.. అసలు ముందు ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మించడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ముందుగా మనం ఒక కమర్షియల్ బిల్డింగ్ లేదా హోటల్ కట్టాలి అనుకుంటే బిల్డింగ్ కంట్రోల్ కమిషనర్ ని అనుమతి తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఆ బిల్డింగ్ ఎంత ఎత్తులో కట్టాలో దానికి పర్మిషన్ ఇస్తారు. ఈ నిబంధనలు కేవలం మెట్రో పోలిటన్ సిటీస్ కే పరిమితం. బీచ్ సైడ్ హోటల్స్ లేదా సిటీ చివరన ఉన్న హోటల్స్ కి ఈ నిబంధనలు వర్తించవు.
అయితే ఇప్పుడు బిల్డింగ్ కంట్రోల్ కమిషనర్ అనుమతి ఇచ్చిన ఎత్తులోనే ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ ని కడతారు. కానీ వారికి ఎక్కువ ఫ్లోర్స్ వస్తే.. ఎక్కువ రూమ్స్, తద్వారా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు. అందుకే సాధారణం కన్నా ఫైవ్ స్టార్ హోటల్స్ రూమ్స్ ని తక్కువ ఎత్తు ఉండేలా కడతారు. అప్పుడు ఎక్కువ ఫ్లోర్స్ కట్టే అవకాశం ఉంది. ఈ కారణంగానే రూమ్స్ లో ఫ్యాన్స్ బిగించరు. అంతే కాకుండా ఫ్యాన్స్ ని ఇన్స్టాల్ చెయ్యడం.. వాటిని మైంటైన్ చెయ్యడం చాలా కష్టం తో కూడిన విషయం. అందుకే మాక్సిమం ఏసీ లనే వినియోగిస్తారు.
అంతే కాకుండా ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఎక్కువగా స్ప్రింగ్ బెడ్స్ నే వాడుతూ ఉంటారు. ఈ క్రమం లో ఎవరైనా కస్టమర్స్ బెడ్ పై జంప్ చేసినా వారికి ఫ్యాన్స్ తగిలి ప్రమాదాల బారిన పడకుండా ఫ్యాన్స్ వినియోగాన్ని తగ్గించారు హోటల్స్ నిర్వాహకులు. మొత్తంగా ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఫ్యాన్ లేకపోవడం వెనుక వారి బిజినెస్ స్ట్రాటజీ తెలుస్తోంది కదూ..