మన జీవితం లో ఒక్కసారి అయినా నేషనల్ హై వే ప్రయాణించే ఉంటాం. బస్సు లలో వెళ్లడం కొంత వరకు సేఫ్ అయినప్పటికి.. అన్ని సార్లు మనకు అలా కుదరకపోవచ్చు. కొన్నిసార్లు బైక్స్ పైనా.. కార్ లలోనా వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్తున్నపుడు మనం రూట్ ని ఎక్కువ గమనించడానికి అవకాశం ఉంటుంది. ఇలా నేషనల్ హై వే పై వెళ్తున్నపుడు మీరెప్పుడైనా కింద చూపిన విధం గా ఈ సెట్ అప్ లను గమనించారా..?
వీటిని SOS అని అంటారు. అంటే.. సేవ్ అవర్ సోల్ ( save our soul ) అని అర్ధం. అంటే.. మనం ఎప్పుడైనా నేషనల్ హై వే పైన వెళ్తున్నపుడు మనకు ఏదైనా ఇబ్బంది కలిగినా.. ప్రమాదం జరిగినా.. మనకు సహాయం చేయడానికి ఎవరు లేని సమయం లో.. మన సేఫ్టీ కోసం ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసారు. నేషనల్ హై వే పైన వెళ్తున్న సమయం లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, మీ ఫోన్ పని చేయకపోయినా.. మీరు ఈ SOS లను ఉపయోగించి సేవలు పొందవచ్చు.
వీటిని ఎలా ఉపయోగించాలంటే.. ఈ సిస్టం కు మధ్యలో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ పైన ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ను లాంగ్ ప్రెస్ చేయగానే.. ఎమర్జెన్సీ సెంటర్స్ కు మీరు ఉన్న ప్లేస్ నుంచి కాల్ వెళ్తుంది. హై వే లలో ప్రతి 200 మీటర్లు కి ఈ sos లు ఏర్పాటు చేయబడి ఉంటాయి.
మీరు చేస్తున్న sos ఎక్కడ ఉందొ వారు కాల్ ద్వారా ట్రేస్ చేయగలుగుతారు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒకసారి లాంగ్ ప్రెస్ చేసాక.. వారి నుంచి మీకు రిప్లై వస్తుంది. ఆ బాక్స్ పైన ఉన్న మైక్రో ఫోన్ ను ఉపయోగించి మీరు మాట్లాడాలి. మీ ఇబ్బంది ని తెలియచేస్తే.. వారు స్పందించి మీ సమస్యను పరిష్కరిస్తారు.