మనం రోజు చూసేవాటిని చాలా సందర్భాలలో పట్టించుకోము. రోజు చూసేదే కదా అని అబ్సర్వ్ చేయకుండా వదిలేస్తాము. కానీ.. చిన్న చిన్న అంశాలలో కూడా పెద్ద అర్ధాలే దాగి ఉంటాయి. అందుకు ఇదే ఉదాహరణ. మనం ఏ సినిమా థియేటర్ కు వెళ్లినా.. చాలా సినిమాలకు ప్రారంభం లో ఈ యాడ్ వస్తూ ఉంటుంది.

ఇది ఓ సిగరెట్ యాడ్. పొగాకు ఆరోగ్యానికి హానికరం, కాబట్టి వాటి వాడకం తగ్గిస్తే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా సంతోషం గా ఉంటారు అని అర్ధం వచ్చేలా ఈ యాడ్ ను రూపొందించారు. ఈ యాడ్ స్టార్ట్ అవగానే, ఓ వ్యక్తి తన కూతురు తో కలిసి కూర్చుంటాడు. సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఆ వెనకాలే అతని భార్య కూడా ఎదో పని చేస్తూ ఉంటుంది. ఆమె విచారం గా ఉంటుంది.

యాడ్ అయిపోగానే చివరిలో.. ఆమె కూతురు తో కలిసి నవ్వుతు కనిపిస్తుంది. తన భర్త సిగరెట్ తాగుతున్నాడని ఆమె మొదట బాధపడుతుంది. ఆ తరువాత అతను సిగరెట్ మానేయడం తో.. ఆమె ఎంతో సంతోషిస్తుంది. సిగరెట్ తాగే వ్యక్తి ఆరోగ్యం మాత్రమే కాదు.. అతని కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. సిగరెట్ మానేయడం వలన మీరు మాత్రమే కాదు.. మీ కుటుంబం కూడా బాగుంటుంది.

watch video:


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE