మనం అర్జెంటుగా ఒక పెద్ద అంతస్తుల భవనంలో ఏదో ఒక ఫ్లోర్ కి వెళ్లాల్సి వస్తుంది. లిఫ్ట్ లో ఎక్కి పైకి వెళ్లొచ్చు అనుకుంటాం. కానీ మనం లిఫ్ట్ దగ్గరికి వచ్చే లోపే అది కదిలిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి లిఫ్ట్ ని ఆపడానికి ప్రయత్నిస్తాం. కానీ అది ఆగదు. ఇంక దాంతో చిరాకు, అసహనం అన్ని వస్తాయి. లిఫ్ట్ మళ్ళీ కిందకి వచ్చే వరకు ఏ బటన్ పడితే ఆ బటన్ నొక్కుతూనే ఉంటాం.
కొంతమందైతే పైకి వెళ్ళే బటన్ కింద కి వచ్చే బటన్ రెండు బటన్లు కలిపి నొక్కేస్తారు. అంటే అర్జెన్సీ ఉంటుంది. అర్థం చేసుకోగలుగుతాం. కానీ అలా రెండు బటన్లు ఒకసారి నొక్కినంత మాత్రాన లిఫ్ట్ జెట్ స్పీడ్ లో కిందకి అయితే వచ్చేసేయదు కదా?
మీకు ఇంకో విషయం తెలుసా? లిఫ్ట్ పాడైపోవడానికి ఇలా రెండు బటన్లు ఒకటే సారి నొక్కడం కూడా ఒక కారణమే. అలా చేసినప్పుడు లిఫ్ట్ పైకి వెళ్లలేక కిందకి రాలేక స్పీడ్ తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఒక్కొక్కసారి ఆగిపోతాయి కూడా.
ఇంకొకటి ఏమిటంటే అలా ఒక్కసారి ప్రెస్ చేసి ఆపరు. కిందకి వచ్చే వరకు చాలా సార్లు బటన్లు నొక్కుతూనే ఉంటారు. అలా చేసినా కూడా లిఫ్ట్ తొందరగా కిందకి రాదు. మీకంటే ముందు లిఫ్ట్ ఎక్కిన వాళ్ళు ఏ ఫ్లోర్ వరకు వెళ్లాలి అని ప్రెస్ చేస్తే ఆ ఫ్లోర్ వరకు వెళ్ళి మళ్లీ కిందకు వస్తుంది.
కాబట్టి లిఫ్ట్ బటన్ల మీద కోపం చూపించకపోవడం మంచిది. అంతేకాకుండా మీరు లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు పెద్ద వాళ్లు లేదా చిన్న పిల్లలు ఉంటే ముందు వాళ్ళని ఎక్కనివ్వండి. తర్వాత మీరు ఎక్కండి. ఒకవేళ అంతగా అర్జెన్సీ లేకపోతే, ఇంకా మీరు వెళ్లాల్సిన ఫ్లోర్ కూడా కొంత దూరమే ఉంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఓపిక ఉంటే మెట్లు ఎక్కి వెళ్లడానికి ప్రయత్నించండి.