కలెక్టర్ కాటా ఆమ్రపాలికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. యంగ్ కలెక్టర్ గా అందర్నీ ఆకర్షిస్తూ అందంతో తన పనితీరుతో మంచి మార్కులు కొట్టేస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.చాలామంది యువత ఆమెను ఫాలో అవుతూ ఉంటారు.
ప్రస్తుతం హెచ్ఎండిఏ కమిషనర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలి గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

అయితే ఆమ్రపాలి ఆహార నియమాల గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఆమ్రపాలి తినే ఆహారం ఇదే అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఏమి తింటారంటే…? ప్రకృతిని ఇష్టపడే ఆమ్రపాలి ఎక్కువ సమయం ప్రకృతిలో గడపడానికి ఇష్టపడతారట. అలాగే ఫిట్నెస్ విషయంలో కూడా మంచిగా శ్రద్ధ తీసుకున్నారు అంట.

ఉదయాన్నే రెండు ఇడ్లీలు, మధ్యాహ్నం పప్పులో నెయ్యి కలిపిన అన్నం, సాయంత్రం వేళలో రెండు చపాతీలు మాత్రమే తింటారట. ఆమ్రపాలి వెజిటేరియన్ మాత్రమే తింటారు. ఆమె దిన చర్యలో నిత్యం యోగ మాత్రం ఉంటుందట. ఇటువంటి డైట్ ఫాలో అవుతారు కాబట్టే ఈ వయసులో కూడా ఆమె 20 ఏళ్ల అమ్మాయిల కనబడుతుంటారు. ఇటువంటి ఆహార నియమాలు పాటిస్తూ బాధ్యత గల అధికారిగా ఒక పౌరురాలుగా యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమ్రపాలిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది కూడా వీటిని పాటించడానికి ఇష్టపడుతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు

ఒక కార్పొరేట్ కంపెనీ సంస్థ యొక్క టాప్ ఎగ్జిక్యూటివ్ చేతితో వ్రాసిన, రెండు పేరాల రాజీనామా లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రింకూ పటేల్ అనే మహిళ మిట్షీ ఇండియా కంపెనీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించేవారు. అయితే ఇటీవల ఆమె రాజీనామా చేశారు. రింకూ పటేల్ రాజీనామా లెటర్ వ్రాసే విషయంలో డిఫరెంట్ గా ఆలోచించింది.
డిసెంబర్ 15న తన మేనేజింగ్ డైరెక్టర్‌కి, పిల్లలు స్కూల్లో ఉపయోగించే నోట్‌బుక్‌లో కనిపించే ఒక రూల్ కాగితంపై వ్రాసిన చేతితో రాసిన రాజీనామా లేఖను సమర్పించారు. అంతేకాకుండా ఈ లేఖ స్టాక్ ఎక్స్ఛేంజ్కు కూడా పంపించారు. ఆ లేఖలో ” వ్యక్తిగత కారణాల” కారణంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పోస్ట్ కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. లేఖ కాపీని డిసెంబర్ 21న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్లో పంచుకున్నారు.
అక్కడి నుండి అది సోషల్ మీడియాలోకి వచ్చింది. చేతిరాతతో రాసిన రాజీనామా లేఖ వైరల్‌గా మారింది. రాయిటర్స్ రిపోర్టర్ సేతురామన్ ఎన్ఆర్ రింకూ పటేల్ చేతితో రాసిన రాజీనామా లేఖ ఫోటోను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ‘తన పిల్లల రఫ్ నోట్ పుస్తకం నుండి ఒక పేజీని తీసుకుని, దానిలో రాజీనామా లేఖ వ్రాసినట్లు’ అనిపించిందని రాసుకొచ్చారు.





“హైదరాబాద్ లో పెరిగిన అమ్మాయిలని పెళ్ళి చేసుకోవటానికి వెనకాడుతున్నారు. ఎందుకని” అనే ప్రశ్నకు
నిజానికది అందరమ్మాయిలకూ ఉండాల్సిన నిగ్గు. కానీ చిన్న ఊర్ల పరిమిత ఆలోచనా ధోరణులు, కట్టుబాట్లకు అలవాటు పడిన తల్లిదండ్రులు, వేసుకునే బట్టలు మొదలు స్నేహాలు, ఆశయాల వరకు అన్నిటా పిల్లలకు పరిమితులు విధిస్తూంటారు (కొన్ని తెలిసీ, ఎన్నో తెలియక). అవగాహన విస్తరించుకోనందున వారి పిల్లలకు (అబ్బాయిలకూ) అవసరమైన స్థైర్యం అలవడటం దాదాపు అసాధ్యం. పై చదువులకో, ఉద్యోగానికో వలసెళ్తే తప్ప ఆ పిడివాదపు సంకెళ్ళను తెంచుకోవటం సాధ్యపడదు. అప్పటికీ ఆ సంకెళ్ళను తెంచుకోనివ్వని తల్లిదండ్రులతో నరకయాతన పడే వ్యక్తులు ఎందరో తెలుసు. చిన్న ఊర్లలో అంతా ఇలాగే ఉంటారని కాదు కానీ బహుశా 80% ఇంతే.
ఇలా పెరిగిన అబ్బాయిలు పట్టణాల్లో పెరిగిన అమ్మాయిలను చేసుకోటానికి వెనుకాడటంలో ఆశ్చర్యం లేదు. వెనుకాడటం అంటే నిజానికి జంకటమేగా? చేతిలో చిల్లిగవ్వ లేనివాడు కోటి రుపాయల ఇల్లు కొనటానికి వెనుకాడటంలా, నెదర్లాండ్స్ జట్టు ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు వెనుకాడటంలాగానే అవతలి వ్యక్తి వ్యక్తిత్వం నా కంటే వికాసం చెందినదేమోనన్న సందేహంతో వెనుకాడటం ఉన్న మాట. కేవలం ఒక వ్యక్తి పెరిగిన ఊరిని బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేసి తీర్పునిచ్చే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని లార్డ్ లబక్దాస్ ఎప్పుడో చెప్పారు” అని రాసుకొచ్చారు.















సోషల్ మీడియా వచ్చాక చాలా మంది అక్కడే ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నారు. అవకాశాలను సృష్టించుకుంటున్నారు. అలా వచ్చిన వారే మీమర్స్. స్టార్ హీరో దగ్గరినుంచి మొదలు పెడితే బంగాళా దుంప వరకు అన్నిటినీ మీమ్స్ లో వాడుతున్నారు. జోక్స్ నుంచి వేదాంతం వరకు ఏదైనా వాడేస్తున్నారు. మీమర్స్ శ్రీ శ్రీ అన్న కాదేదీ కవిత కనర్హం అన్న వాక్యాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు.