కూల్ డ్రింక్స్ టేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ లో ఒకలా.. టిన్ లో ఒకలా.. ఎందుకుంటుందో తెలుసా..??

కూల్ డ్రింక్స్ టేస్ట్ ప్లాస్టిక్ బాటిల్ లో ఒకలా.. టిన్ లో ఒకలా.. ఎందుకుంటుందో తెలుసా..??

by Anudeep

Ads

ఇటీవలి కాలంలో నీటికి బదులుగా కూల్ డ్రింక్స్ తాగే అలవాటు పెరిగిపోయింది. ఇక వేసవి కాలంలో చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది కూలిడ్రింక్స్ సీసాల కొద్దీ తాగేస్తుంటారు. తిన్నది అరిగించుకునేందుకు చాలా మంది కూల్ డ్రింక్స్ ను అదేపనిగా తాగుతుంటారు. అయితే తరచుగా కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఒక డిఫరెన్స్ గమనించి ఉంటారు. అదే బాటిల్స్ లో ఉండే డ్రింక్స్, క్యాన్స్ లో ఉండే డ్రింక్ టేస్ట్ వేరుగా ఉండటం మనం చూసే ఉంటాం.. ఇప్పుడు దానికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

కూల్ డ్రింక్స్ ను సాధారణం గా గాజు బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, లేదా క్యాన్స్ లో ఉండటం మనం చూస్తాం.. అయితే వాటన్నిటిని తయారు చేసే విధానం ఒకటే అయినా.. ఒక్కో దానిలో తాగితే ఒక్కో రుచి ఉంటుంది. అయితే కూల్ డ్రింక్స్ ని ప్లాస్టిక్ బాటిల్స్ లో నింపినపుడు.. ప్లాస్టిక్ లో ఉండే ఎసిటాల్డిహైడ్ అనే రసాయనం వల్ల డ్రింక్ టేస్ట్ మారుతుంది. ఆ రసాయనం కూల్ డ్రింక్స్ లోకి వెళ్లడంతో వేరే రుచి వస్తుంది.

Why Canned and Bottled Soda Taste Different..!!

అదే విధంగా అల్యూమినియం క్యాన్‌ లలో కూడా జరుగుతుంది. అల్యూమినియం క్యాన్స్ లో ఒక వాటర్ రెసిస్టెంట్ పాలిమర్ తో పూత పూస్తారు. దీని వల్ల అల్యూమినియం, డ్రింక్ కలవకుండా ఉంటాయి. అలాగే ఆ పాలిమర్ అల్యూమినియం టిన్ తుప్పు పట్టకుండా చూస్తుంది. ఈ పాలిమర్ పూత వల్ల క్యాన్స్ లో కూల్ డ్రింక్ టేస్ట్ వేరే గా ఉంటుంది.

Why Canned and Bottled Soda Taste Different..!!

అయితే మనం కూల్ డ్రింక్స్ అసలు టేస్ట్ రుచి చూడాలి అనుకుంటే గాజు సీసాల్లో తాగటం ఉత్తమ పద్ధతి. గాజు సీసాల్లో కూల్ డ్రింక్ పొయ్యడం వల్ల ఎటువంటి రసాయనాలు ఆ పానీయం లోకి వెళ్లవు. కాబట్టి దాని ఒరిజినల్ టేస్ట్ కి అది దగ్గరగా ఉంటుంది. ఇవే కాకుండా కొన్ని పరిస్థితుల్లో కూల్ డ్రింక్ టేస్ట్ మారే అవకాశం ఉంది. బాటిల్స్‌పై బెస్ట్-బై లేదా ఫ్రెష్‌నెస్ తేదీలు ఉన్నప్పటికీ.. కూల్ డ్రింక్ స్టోర్ చేసిన టెంపరతురే ని బట్టి దాని టేస్ట్ మారుతుంది. అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంది డ్రింక్, లేదా తాజా డ్రింక్ కూడా వేర్వేరు రుచులని కలిగి ఉంటాయి.

Why Canned and Bottled Soda Taste Different..!!

అయితే కూల్ డ్రింక్స్ ని ఎక్కువగా తాగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కూల్‌డ్రింకులకు ఆకర్షణీయమైన రంగులు తెచ్చిపెట్టే కృత్రిమ రంగులు, కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణాలను నాశనం చేస్తాయి. దాంతో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కూల్‌ డ్రింక్‌ తాగడం వల్ల రక్తంలో ట్రైగ్లిసరైడ్లు 30% పెరగుతాయి. ఇవి గుండె రక్తనాళాలను గట్టిపరుస్తాయి. 350మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ లో 35 నుండి 45 గ్రాముల షుగర్ ఉంటుంది. కూల్ డ్రింక్ తాగిన ఐదు నిమిషాల్లో శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మధుమేహం బారిన పడే అవకాశాలను 67% వరకూ కొని తెచ్చుకున్నట్లే.


End of Article

You may also like