సృష్టిలో ఎన్నో రహస్యాలు ఇప్పటికీ ఛేదించలేకపోయారు. ముందు జీవం ఎలా ఏర్పడింది.. స్త్రీ ముందు వచ్చిందా.. పురుషుడా..? అని. ఇది పక్కన పెడితే ప్రపంచం లో ఎప్పటినుంచో ఒక చర్చ జరుగుతోంది. అదే ఆడ, మగ.. వీరిద్దరిలో ఎవరు గొప్ప..?? దీనిపై రోజుకో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆడవారు, మగవారు బృందాలుగా విడిపోయి మరీ ఈ అంశం పై చర్చించుకుంటారు. అయితే ఆడవారి సృష్టి వెనుక ఒక రహస్యం ఉందట. దాని గురించి కొన్ని కథలు కూడా ఉన్నాయి.. అదేంటో ఇప్పుడు చూద్దాం..
భగవంతుడు సృష్టిని తయారు చేస్తున్న సమయం లో స్త్రీ ని తయారు చేసేటపుడు చాల ఎక్కువ సమయం తీసుకున్నాడట..వారం రోజులు అయినా దేవుడు స్త్రీ ని తయారు చెయ్యడం పూర్తికాలేదట.. దేన్నైనా క్షణాల్లో సృష్టించే దేవుడు ఈ విషయం లో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడని ఆశ్చర్యపోయిన దేవ దూతలు.. దేవుడ్ని అదే విషయం అడిగారట. అప్పుడు దేవుడు వారు అడిగిన ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాలు ఇచ్చాడట.

స్వామి ఒక్క క్షణం లో ప్రపంచాన్నే సృష్టించిన మీకు.. స్త్రీని సృష్టించడానికి ఎందుకు ఇంత సమయం పడుతుంది అని దేవ దూతలు అడుగగా.. అప్పుడు భగవంతుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడట.. ” దూతలారా.. నేను ఇప్పుడు సృష్టించేది ఒక అద్భుతాన్ని.. ఈమె ఎటువంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా ఉంటుంది..సమస్యలెన్ని ఎదురైనా ఎదుర్కొంటుంది..ఎటువంటి పరిస్థితిలోనైనా అందర్నీ సంతోషం గా ఉంచుతుంది.. అందర్నీ సమానం గా ప్రేమించగలిగే ఆమె, కొన్ని సార్లు తనని తాను మర్చిపోతుంది కూడా..అనారోగ్యంగా ఉన్నప్పటికీ తన వాళ్ళని ఇబ్బంది పెట్టదు. ఈమె లో నేను ఎంత ప్రేమని పెడుతున్నా అంటే ఈ ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా.. ఆమె ప్రేమని మించలేదు.” అని సమాధానం చెప్పాడట భగవంతుడు.

అది విన్న దేవ దూత.. స్వామి ఇంత సుకుమారం గా ఉన్న ఈమె లో ఇన్ని గుణాలు ఉన్నాయా.. అని ప్రశ్నించాడు.. అప్పుడు భగవంతుడు ” అందుకే ఆమెను సృష్టించడానికి నాకు ఇంత సమయం పడుతుంది. ఆమె బయటి నుంచి ఎంత కోమలం గా ఉన్నా.. లోపలి నుంచి చాలా దృఢమైనది. అవసరాన్ని బట్టి ఆమె లోని బలం బయటకు వస్తుంది.” అని చెప్పాడట.

అప్పుడు దేవదూత భగవంతునితో ఈమె మగవారి కంటే బలమైనదా అని ప్రశ్నిస్తాడు. ” అవును మగువ మగవారి కంటే చాలా బలమైనది. ఆమె ఎప్పుడైతే తనకు వచ్చే కష్టాలు, పరీక్షలను భరించలేదో అప్పుడు తన కంటి నుంచి నీరు వస్తుంది. ఆ వెంటనే ఆమె తిరిగి బలం పుంజుకుంటుంది. మగువ సృష్టి మానవ మనుగడకు చాలా అవసరం” అని జవాబిస్తాడు భగవంతుడు. కేవలం పురాణాల ఆధారం గానే కాకుండా సైన్స్ కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తుంది. మహిళలు పురుషులకంటే మానసికంగా చాలా బలమైన వారు అని.



ఇంకొందరు ఇంట్లో ఉన్నా కొన్నిసార్లు రెస్టారెంట్స్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని తింటున్నారు. వేలకు వేలు బిల్లులు అయినా కూడా కొందరు లగ్జరీ కోసం బయటకు వెళ్లి తింటుంటారు. కాగా, డిల్లీలోని లజపత్ నగర్ లో ఉండే లజీజ్ రెస్టారెంట్ 1985 డిసెంబర్ 20 నాటి బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ బిల్లును చూసిన వారు షాక్ అవుతున్నారు.
ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే, అది ఒక రెస్టారెంట్ బిల్లు, అందులో ఓ కస్టమర్ ఒక ప్లేట్ దాల్ మఖనీ,షాహిపన్నీర్, రైతా మరియు కొన్ని చపాతీలు ఆర్డర్ చేసారు. అయితే మొదటి రెండు వంటకాలకు(దాల్ మఖనీ, షాహిపన్నీర్) 8 రూపాయలు, మిగతా రెండింటికీ 5, 6 రూపాయలు. ఆశ్చర్యానికి గురి చేసేటు వంటి విషయం మొత్తం బిల్లు కేవలం 26 రూపాయలు. అంటే అప్పట్లో బిల్లులు చాలా తక్కువ. ప్రస్తుత ధరతో పోలిస్తే ఒక చిప్స్ ప్యాకెట్ రేటుకి సమానం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ పోస్ట్ 2013 ఆగస్టు 12న ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరలయ్యింది.






























