మనం గూగుల్‌లో గడియారం చిత్రాలను వెతికితే ఏ చిత్రం చూసినా అందులో ఉండే టైమింగ్‌ 10 గంటల 10 నిమిషాలు. అలాగే చాలా వాచ్‌ షాపులకు వెళితే అక్కడ ఉండే గడియారాలు కూడా 10 గంటల 10 నిమిషాలు కనిపిస్తుంటాయి. కానీ ఈ విషయాన్ని మనం అంతగా గమనించం. మన చుట్టూ ఉండే ఆసక్తికరమైన అంశాల్లో ఇది ఒకటి. కానీ మనం దాని గురించి తెలుసుకొనే ప్రయత్నం చెయ్యం.. ఇప్పుడు దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

 

గడియారాలను తయారు చేసే కంపెనీలు, వాటి ప్రోమోషన్స్ లో, యాడ్స్ లో ఎక్కువగా 10:10 సమయాన్ని మాత్రమే ఉంచుతాయి. వాచీల షోరూంలలో.. గోడ గడియారం అయినా, టైమ్‌పీస్ లేదా చేతి గడియారం అయినా 10:10 సమయాన్ని చూపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే 10:10 సమయం ఉన్న కోణం, వ్యక్తి నవ్వుతున్నట్టు ఉంటుంది. ఎవరైనా నవ్వే సింబల్ కి బొటని వేలు, చూపుడు వేలు వీ ఆకారంలో పెట్టి చూపిస్తారు. దీని వెనుక ఉన్న ఉద్దేశం కూడా అదే. ఇది హ్యాపీ మూడ్ ని సూచిస్తుందని కొందరు ఉద్యోగులు వెల్లడించారు.

why wall clock always shows 10.10 for ads..!!

అలాగే ఒక కోణం లో 10:10 ని చుస్తే విజయానికి అంటే విక్టరీకి ప్రతి రూపమైన వీ షేప్ లో ఉంటుంది. ఇది గడియారం కొనే వారికి పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. అంతే కాకుండా ఈ టైం సెట్ చెయ్యడం ద్వారా రెండు ముళ్ళు, వాటి డిజైన్ క్లియర్ గా కనిపిస్తుంది. అంతే కాకుండా ఆ గడియారాన్ని తయారు చేసిన కంపెనీ నేమ్, లోగో స్పష్టంగా కనిపించేందుకు ఇదే మంచి మార్గం. అందుకే అన్ని కంపెనీలు ఈ టైం నే సెట్ చెయ్యడం ప్రారంభించాయి.

why wall clock always shows 10.10 for ads..!!

ఇక మరో కారణం ఏంటంటే అమెరికా మాజీ అధ్యక్షుడు లింకన్ ను కాల్చి చంపిన సమయం 10:10 అని అందుకే అలాగే ఉంచారని అంటారు. కానీ అది నిజం కాదని నిపుణులు చెబుతారు. ఇక టైమెక్స్ కంపెనీ వాళ్ళు ఒకసారి 8:20 సమయాన్ని సూచిస్తున్నట్టు ఒక గడియారాన్ని ప్రమోట్ చేసినా తర్వాత అన్ని కంపెనీల మార్గంలోకి వచ్చేశారు.