ఆచార్య చాణక్య తన నీతీ ద్వారా నిజ జీవితంలో జరిగే సత్యాలను వివరిస్తూ వచ్చారు. ఈ విధంగా ఆయన బోధనలు జీవితంలో ఏదో ఒక కోణంలో మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. చాణక్యుడు చెప్పినట్లు పెళ్లి చేసుకునే ముందు మనం అమ్మాయిని చూసుకోవడానికి వెళ్లేటప్పుడు యువకులు ఏవిధంగా ఉండాలో చాణక్యుడి తెలియజేశాడు. ఇండియా లోని గొప్ప పండితులలో చాణిక్యుడు చాలా పేరుపొందిన నీతి శాస్త్రజ్ఞుడు.
చాణక్యుని విధానాల వల్లనే చంద్రగుప్త మౌర్యుడు మగధ రాజ్యానికి చక్రవర్తి కాగలిగాడు. ఆచార్య చానిక్యుడు సమాజంలోని చాలా విషయాలపై తన నీతీ ద్వారా సూచనలు చేశారు. ఇందులో ముఖ్యంగా వివాహ విషయానికి వస్తే మాత్రం సంస్కారవంతమైన భాగస్వామి లభించడం కోసం యువకులు పెళ్లిచూపులు వెళ్లేటప్పుడు ఎలా మెలగాలో చాణిక్యుడు తెలియజేశారు.
#1. పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు స్త్రీ అందాన్ని చూసి వివాహాన్ని నిర్ణయించుకోవడం తప్పు. వివాహం చేసుకునే ముందు భాహ్య సౌందర్యం కంటే ఆమె గుణగణాలు ముఖ్యమని చాణక్య నీతి చెబుతోంది.
#2. అలాగే పురుషులు గానీ స్త్రీలు గానీ మతానికి సంబంధించిన ఆచారాలపై నమ్మకం కలిగి ఉండాలి. ఈ విధంగా నమ్మకం కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడం చాలా మంచిదని చాణక్యుడు తెలియజేశారు.
#3. అలాగే మధురంగా మాట్లాడే స్త్రీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఆచార్య చాణక్యుని తెలియజేశారు. వివాహం చేసుకునే ముందు చక్కగా మాట్లాడే స్త్రీ ని ఎంచుకుని చేసుకోవడం మంచిదని చాణిక్యుడు తన నీటి ద్వారా తెలియజేశారు.