కార్ వెనక అద్దంపై ఆ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షో కోసం కాదు…కారణం ఇదే.!

కార్ వెనక అద్దంపై ఆ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? షో కోసం కాదు…కారణం ఇదే.!

by Anudeep

Ads

ప్రపంచం రోజు రోజుకి ముందుకు సాగుతూ అభివృద్ధి చెందుతుంది అంటే దానికి కారణం టెక్నాలజీ ..నూనె దీపం దగ్గర నుండి ట్యూబ్ లైట్ దాక , టెలిఫోన్ నుండి స్మార్ట్ ఫోన్ దాక అంత ఇలా జరిగిందే ..చిన్న చిన్న ఆవిష్కరణలే పెను మార్పులు తీసుకువస్తాయి ..ఈ రోజున ప్రపంచం లో కష్టతరమైన పనులు అన్ని కూడా మెషిన్ల సహాయంతో సులువు అయిపోయాయి . అన్ని రంగాలలోను టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది.ఎంతో ఉపయోగకరమైన అంశాలని కూడా చిన్నవిగా ఉండటం వలన మనం గమనించం కానీ వాటిలో ఎంతో గొప్ప నైపుణ్యం దాగి ఉంటుంది ..సరిగ్గా అలాంటిదే  కార్ విండోస్ పై ఉపయోగించిన టెక్నాలజీ కూడా …ఆలస్యమెందుకు అదేంటో తెలుసుకుందాము రండి.

Video Advertisement

సామాన్యంగా కార్ విండోస్ పై వైపర్ బ్లేడ్స్ ఉంటాయి ..వర్షం పడే సమయంలో ఇవి బాగా ఉపయోగపడతాయి.వర్షం నీరు పడి ఎదురుగ వస్తున్నవి కనపడని సమయంలో ఇవి నీటిని క్లీన్ చేస్తూ చూసే వ్యూని స్పష్టంగా కనపడేలా చేస్తాయి ..దాని తర్వాత దీనికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే… విండ్ షీల్డ్ లైన్స్ …మీరు ఈ సన్నని లైన్స్ ని కార్ వెనక విండోస్ మీద గమనించి వుంటారు ..కానీ అవి ఎందుకు ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? షో కోసం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.

విండోస్ మీద వుండే ఈ లైన్స్ ని Defoggers అని అంటారు ..ఇవి ఎలక్ట్రికల్ లైన్స్ …వీటి గుండా కరెంటు ప్రహహిస్తుంది ..దాని వలన విండో గ్లాస్ వేడి ఎక్కుతుంది దాంతో విండో మీద చేరిన తేమ మంచు తొలిగిపోయి స్పష్టమైన వ్యూ వస్తుంది ..కారులోని ఈ చిన్న విషయం పెద్ద టెక్నాలజీ గా అనిపించకపోవచ్చు ,కానీ అవి ప్రయాణికులకు భద్రత మరియు సౌకర్యానికి వీలుగా ఉంటాయి ..ఈసారి మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు ఆ లైన్స్ పనితనాన్ని జాగ్రత్తగా గమనించండి . ఏమైనా కార్ల తయారీ సంస్థలు ఇలాంటి  చిన్న విషయాలపై శ్రద్ద చూపిస్తుందంటే మెచ్చుకోదగ్గ విషయమే కదా .


End of Article

You may also like