తెలంగాణలో టిఆర్ఎస్ బిజెపి తరువాత స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొద్ది నెలల్లోనే అద్భుతంగా పుంజుకొని ఇప్పుడు తెలంగాణ అధికార పీఠాన్ని దక్కించుకుంది. హ్యాట్రిక్ సాధించాలనుకున్న కేసీఆర్ ఆశలపై నీళ్లు జల్లి బీఆర్ఎస్ ని ఇంటికి పంపించింది.
అయితే ఒకప్పుడు మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా తెలంగాణ అధికారాన్ని చేపట్టటం వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో సునీల్ కనుగోలు ఒకరు. సునీల్ కనుగోలు పీకే శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రస్తుతం గురువును మించిన శిష్యుడు అనిపించుకుంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికార పీఠాన్ని చేజిక్కించుకోవడంలో కూడా సునీల్ కనుగోలు ప్రధాన పాత్ర వహించారు.
అప్పట్లో కర్ణాటకలో కూడా సునీల్ కనుగోలు పేరు మారుమోగిపోయింది కర్ణాటకలో పే సీఎం అంటూ అధికార ప్రభుత్వం అవినీతిపై కాంగ్రెస్ ఒక రేంజ్ లో విరుచుకు పడింది అంటే దాని వెనుక ప్రధాన సూత్రధారి సునీల్ అని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం అతనికి ఉన్నత పదవిని ఇచ్చి గౌరవించింది. అదే సునీల్ ను హైదరాబాద్ కి పంపించి ఇక్కడ వ్యవహారాలని చెక్కబెట్టే బాధ్యత ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఈ విషయంలో సునీల్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
తనదైన ప్రణాళికలతో రాజకీయ నేర్పుతో కాంగ్రెస్ ని పోటీలోకి తీసుకువచ్చారు సునీల్. నిజానికి సునీల్ హైదరాబాద్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉండి డీలపడినట్లు ఉండేది. సునీల్ రంగ ప్రవేశం చేసిన తరువాత ప్రభుత్వాన్ని పగడ్బందీగా టార్గెట్ చేసి ప్రజల్లో టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకతో ఏర్పడేలాగా చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలని బిజెపి బిఆర్ఎస్ ఒకటే అనే ప్రచారం చేయడంలోనూ.. మేడిగడ్డ కొంగటం వంటి విషయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి కేసీఆర్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తీసుకురావడంలో సునీల్ సక్సెస్ అయ్యారు. దీంతో ఇప్పుడు సునీల్ పేరు మారం రోగిపోతుంది సునీల్ గతంలో ప్రశాంత్ కిషోర్ దగ్గర పని చేశారు. తర్వాత స్వతంత్రంగా కర్ణాటక తెలంగాణ ఎన్నికలలో పనిచేసే రెండు చోట్ల విజయం సాధించారు. ఇప్పుడు గురువును మించిన శిష్యుడు అంటూ అందరి చేత కితాబులు అందుకుంటున్నారు