ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి. ఈ పేరు ఏపీ రాజకీయాలలో కూడా ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుపొందారు రేవంత్ రెడ్డి. దీంతో అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలో అంబరాలు సంబరాలు అంటుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో చాలా సేపు ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వామ్యులు.

మేము పాలకులం కాదు. ప్రజా సేవకులం. ప్రజలు ప్రగతి భవన్ కు రావచ్చుఅని తెలిపారు రేవంత్ రెడ్డి. ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాము. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావచ్చు. కాంగ్రెస్ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చింది. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రసంగం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి ముందుగా మాట ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారెంటీల అభయ హస్తం అమలు ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగాన్ని కల్పిస్తూ సంతకం చేశారు.

రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం,తొలి సంతకం అభయహస్తం ఫైలుపై చేయడంతో పాటు రజిని అనే దివ్యాంగురాలికి ఉద్యోగం కల్పిస్తూ సంతకం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. కాగా ఉద్యోగం కల్పించాలని రజిని అనే దివ్యాంగురాలు కొంతకాలం క్రితం గాంధీభవన్ లో కలిసి రేవంత్ ను కోరగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తానని హామీనిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే రజిని అనే దివ్యంగురాలికి ఉద్యోగం కల్పిస్తూ ఫైలుపై సంతకం చేశారు.












#2 రేవంత్ రెడ్డి భార్యతో దిగిన ఫోటో.
#3 రేవంత్ రెడ్డి కుటుంబంతో దిగిన ఫోటో.
#4 మంత్రి కేటీఆర్ తో రేవంత్ రెడ్డి.
#5 తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలతో.
#6 భార్య పిల్లలతో రేవంత్ రెడ్డి.
#7 నందమూరి బాలకృష్ణ తో రేవంత్ రెడ్డి దిగిన ఫోటో.
#8 రేవంత్ రెడ్డి కూతురి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు. ఆ పెళ్ళికి చిరంజీవి వచ్చి ఆశీర్వదించినప్పుడు రేవంత్ రెడ్డి తో కలిపి తీయించుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.
#9 ఒక రాజకీయ వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సంభాషిస్తున్న రేవంత్ రెడ్డి ఫోటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.
#10 ఒక అవార్డు ఫంక్షన్లో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రేవంత్ రెడ్డితో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే త్వరలోనే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు అని తెలిసిన వెంటనే దిల్ రాజు రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం.
#11 రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో బాలకృష్ణతోను, జూనియర్ ఎన్టీఆర్ తోను మంచి అనుబంధాన్ని మెయింటైన్ చేశారు రేవంత్ రెడ్డి. 2009లో టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొన్నప్పుడు వారిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. ఆ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
#12 నటుడు నందమూరి బాలకృష్ణతో రేవంత్ రెడ్డి.
#13 నిర్మాత బండ్ల గణేష్ తనని కలిసినప్పుడు తీయించుకున్న ఫోటో.
#14 నటి సురేఖ వాణి, సురేఖ వాణి కూతురు సుప్రీతతో రేవంత్ రెడ్డి.









