ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి. అనేక సమాఖ్యలు, అనేక రాష్ట్రాలు, అనేక మతాలు, అనేక సహజ విభేదాలు, అనేక భాషలు, అనేక జాతులు ఉన్నాయి. వీటన్నిటిని రాజ్యాంగ బద్దంగా నడిపించేందుకు పలు పదవులు నియమించి బడ్డాయి.
అయితే ఈ పదవుల్లో ఉన్న వారికీ జీతాలు ‘ కన్సాలిడేటెడ్ ఫండ్ అఫ్ ఇండియా’ నుంచి వస్తాయి. ప్రజలు కట్టే టాక్స్ ల ద్వారా ఈ అకౌంట్ లోకి డబ్బు జమ అవుతుంది.
ఆయా పదవులకు ఇచ్చే జీతాలు, ఇతర ప్రయోజనాలు వంటి వాటిని ఇప్పుడు తెలుసుకుందాం..
#1 రాష్ట్రపతి
రాష్ట్రపతి భారత రిపబ్లిక్ ప్రెసిడెంట్. రాజ్యాంగబద్ధంగా భారతదేశానికి అధిపతి. భారత సాయుధ దళాలకు కమాండర్-ఇన్-చీఫ్. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే వ్యక్తి రాష్ట్రపతి. ఆయన లేదా ఆమెకు నెలకు ఐదు లక్షలు చెల్లిస్తున్నారు.
2018లో రాష్ట్రపతి వేతనాన్ని రూ.1.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. 1998కి ముందు రాష్ట్రపతికి రూ.10,000 చెల్లించేవారు. 1998లో ఈ మొత్తాన్ని 50,000కు పెంచారు. రాష్ట్రపతికి వారి జీతంతో పాటు అనేక అలవెన్సులు కూడా లభిస్తాయి.
#2 ఉప రాష్ట్రపతి
పార్లమెంటు అధికారుల జీతాలు, అలవెన్సుల చట్టం, 1953 మేరకు దేశ ఉపరాష్ట్రపతి జీతాన్ని నిర్ణయిస్తారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్గా కూడా వ్యవహరిస్తారు. కాబట్టి స్పీకర్ జీతం, ప్రయోజనాలను అందుకుంటారు. నివేదికల ప్రకారం.. ఉపరాష్ట్రపతికి నెలకు రూ.4 లక్షలు చెల్లిస్తారు. అంతే కాకుండా వారికి వివిధ అలవెన్సులు అందజేస్తారు.
#3 ప్రధాన మంత్రి
మన దేశ ప్రధాన మంత్రి కి రెండు లక్షల జీతం ఉంటుంది.దానితో పాటు పార్లమెంటు సభ్యుడుగా ఉన్నందుకు నాలుగు లక్షల జీతం అందుకుంటారు. అంటే మొత్తం ఆరు లక్షల రూపాయలు.
#4 సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి 2 .80 లక్షల జీతం ఉంటుంది. కానీ వీరికి ప్రత్యేక అలవెన్స్ లు ఉండవు.
#5 సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు 2 .50 లక్షల జీతం ఉంటుంది.
#6 గవర్నర్
ఒక రాష్ట్ర గవర్నర్ కి నెలకి 5 లక్షల జీతం ఉంటుంది.
#7 ముఖ్యమంత్రి
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కేవలం 50 వేల రూపాయలు మాత్రమే. కానీ దానితో పటు శాసన సభ సభ్యుడిగా ఉన్నందుకు మూడున్నర లక్షల జీతం వస్తుంది. మొత్తం మీద నాలుగు లక్షల జీతం తీసుకుంటారు.