మసూద సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు తిరువీర్ . ఘాజీ, మల్లేశం, జార్జిరెడ్డి, ‘పలాస’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తిరువీర్. మసూద’ సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు . ఇక ఇప్పుడు పల్లెటూరి సరదా డ్రామా పరేషాన్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
- చిత్రం : పరేషాన్
- నటీనటులు : తిరువీర్, మురళీధర్ గౌడ్, పావనీ కరణం, బన్నీ అభిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ
- నిర్మాత : సిద్దార్థ్ రాళ్లపల్లి
- దర్శకత్వం : రూపక్ రొనాల్డ్సన్
- సంగీతం : యశ్వంత్ నాగ్
- విడుదల తేదీ : జూన్ 2 , 2023
స్టోరీ:
క్రైస్తవుడైన సమర్పణ్(మురళీధర్ గౌడ్) ఓ సింగరేణి ఉద్యోగి. అతని కొడుకు ఐజాక్ (తిరువీర్) ఒక తిరుగుబోతు. కొడుకును దారిలో పెట్టేందుకు తన ఉద్యోగాన్ని అతనికి అప్పజెప్పాలనుకుంటాడు సమర్పణ్. ఇందుకోసం అధికారులకు రెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వస్తోంది. కానీ ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. దీంతో ఐజాక్ విచిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కకుంటాడు. ఇంతకీ ఆ డబ్బు అధికారులకు ఇచ్చాడా? మధ్యలో ఐజాక్ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? మధ్యలో అతడి గర్ల్ ఫ్రెండ్ గర్భవతి అని తెలుస్తుంది. ఇక ఆ డబ్బు ఎవరు కొట్టేశారు అనేది మిగిలిన కథ..
రివ్యూ:
ఈ మధ్య చాలా సినిమాల్లో తెలంగాణ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ సినిమాలు కూడా ప్రేక్షకులు బాగానే ఆకట్టుకున్నాయి కూడా. ఇక పరేషాన్ కూడా అదే కోవలోకి వస్తుంది. తెలంగాణ నేటివీటీతో చాలా సహజంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ కథలో ఏమాత్రం కొత్తదనాన్ని చూపించలేకపోయాడు. ఆ విషయంలో మరింత వర్క్ చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
పని పాట లేకుండా తిరిగే కొడుకు..అతన్ని తిట్టే తండ్రి..మధ్యలో ప్రేమకథ.. ఇలాంటి నేపథ్యంలో ఇంత వరకు చాలా కథలే వచ్చాయి. ఇందులో కొత్తేముంది. ఇదే ఈ సినిమాకు ప్రధాన మైనస్‌గా మారింది. ఎమోషనల్ సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. ఫన్ని జనరేట్ చేస్తూ దర్శకుడు నడిపించిన విధానం బాగానే ఉన్నా కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం ప్రధాన మైనస్‌గా మారింది. దీంతో సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.
సినిమాలో తిరువీర్ నటన చాలా బాగుంది. తన సహజమైన, అమాయకమైన నటనతో మెప్పించాడు. శిరీష పాత్రలో పావని కరణం చక్కగా నటించింది. ఇక అర్జున్ కృష్ణ, రవి, బన్ని అభిరామ్ కూడా తమ పాత్ర మేరకు బాగా నటించారు. యశ్వంత్ నాగ్ సంగీతం కూడా సో సో గానే ఉంది. వాసు పెండమ్ సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది.
ప్లస్ పాయింట్స్:
- ప్రధాన పాత్రల నటన
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ
- ఆకట్టుకోని కామెడీ సీన్స్
- బోరింగ్ సన్నివేశాలు
రేటింగ్: 2 /5
ట్యాగ్ లైన్: మొత్తానికి పరేషాన్ మూవీ రొటీన్ కన్ఫ్యూజన్ కామెడీ డ్రామా.
Watch trailer: