వీకెండ్ అవ్వడంతో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు శివ కందుకూరి నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా కూడా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : భూతద్దం భాస్కర్ నారాయణ
- నటీనటులు : శివ కందుకూరి, రాశి సింగ్, అరుణ్ కుమార్, వర్షిణి సౌందరరాజన్.
- నిర్మాత : స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముడుంబి
- దర్శకత్వం : పురుషోత్తం రాజ్
- సంగీతం : శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
- విడుదల తేదీ : మార్చి 1, 2024
స్టోరీ :
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో వరుసగా కొంత మంది చనిపోతూ ఉంటారు. ఒక వ్యక్తి వారందరిని చంపేస్తూ ఉంటాడు. వారి తలలు తీసుకొని, ఆ స్థానంలో దిష్టిబొమ్మలు పెట్టి వెళ్ళిపోతాడు. దాంతో అక్కడ ఉన్న ఒక లోకల్ డిటెక్టివ్ అయిన భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) ఈ కేస్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ముందుకి వస్తాడు. అసలు ఆ చంపే వ్యక్తి ఎవరు? అలా ఎందుకు చేస్తున్నాడు? భాస్కర్ నారాయణ ఆ వ్యక్తిని ఎలా కనిపెట్టాడు? ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
డిటెక్టివ్ థ్రిల్లర్ అనే జోనర్ లో చాలా సినిమాలు వచ్చాయి. చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. ఒక కేసుని ఆ డిటెక్టివ్ ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాడు అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తే ఆ సినిమా హిట్ అయినట్టే. ఇటీవల ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అలాగే పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా కూడా అలాంటి ఒక విషయం మీదే నడుస్తుంది. ఇందులో దర్శకుడు ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగుంది.
అంతే కాకుండా సినిమాని పురాణాలకి సంబంధం ఉండేలాగా ఉన్న సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. అందులోనూ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా సీన్స్ ఇంకా కొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది అని అనిపించే విధంగా ఉంటాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, శివ కందుకూరి, భాస్కర్ నారాయణ పాత్రలో బాగా నటించారు.
హీరోయిన్ రాశి సింగ్ తన పాత్ర పరిధి మేరకు నటించారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. కొన్ని ట్విస్ట్ సీన్స్ రాసుకున్న విధానం కూడా బాగుంది. సినిమాలో ఉన్న సస్పెన్స్ ని క్లైమాక్స్ వరకు తీసుకెళ్లడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ కొన్ని సీన్స్ మాత్రం రొటీన్ గా అనిపిస్తాయి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ పాయింట్
- కొన్ని ట్విస్ట్ లు
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- ఎడిటింగ్
మైనస్ పాయింట్స్:
- రొటీన్ గా అనిపించే కొన్ని సీన్స్
- సెకండ్ హాఫ్ లో ల్యాగ్
రేటింగ్ :
2.75/5
ట్యాగ్ లైన్ :
అక్కడక్కడ మధ్యలో వచ్చే రొటీన్ సీన్స్ ని పక్కన పెడితే, ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు, డిటెక్టివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఒక్కసారి చూడగలిగే ఒక డీసెంట్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “నీ యావ ఆడవాళ్ళ మీద నుంచి మగవాళ్ళ మీదకి మళ్లిందా?”… అంటూ పవన్ పై ఫైర్ అయిన జగన్ అభిమాని.!