ఇవాళ క్రికెటర్ రోహిత్ శర్మ తన 35వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది ప్రముఖ క్రికెటర్లు అలాగే ఎన్నో రంగాలకి చెందిన సెలబ్రిటీలు రోహిత్ శర్మకి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ కోహ్లీ కూడా సోషల్ మీడియా ద్వారా రోహిత్ శర్మ కి విషెస్ తెలిపారు.
రోహిత్ శర్మ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని బన్సోడ్‌లో జన్మించారు. రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ విశాఖపట్నానికి చెందిన వారు. రోహిత్ శర్మ తండ్రి గురునాథ్ శర్మ రవాణా సంస్థ స్టోర్‌హౌస్‌లో కేర్‌టేకర్‌గా పనిచేశారు. రోహిత్ శర్మ తండ్రికి ఆదాయం తక్కువ ఉండటం కారణంగా రోహిత్ శర్మ బోరివలిలో అతని తాతలు మరియు మేనమామల వద్ద పెరిగారు. రోహిత్ శర్మ కేవలం వారం చివరిలో మాత్రమే డోంబివిలిలోని ఒకే గది ఇంట్లో నివసించే తన తల్లిదండ్రులను కలిసేవారు.
రోహిత్ శర్మకి విశాల్ శర్మ అనే తమ్ముడు ఉన్నారు. రోహిత్ శర్మ తన మామయ్య ఇచ్చిన డబ్బుతో 1999లో క్రికెట్ క్యాంప్ లో చేరారు. రోహిత్ శర్మ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతున్నారు. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ముంబై ఇండియన్స్ జట్టుకి మధ్య మ్యాచ్ ఉంది. రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14