క్రికెట్ లో అనుకోని సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. వీటిని అభిమానులు పలు రకాలుగా అన్వయిస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో ఇవి చాలా కనబడుతూ ఉంటాయి. ఆదివారం రోజున వాంఖడే స్టేడియంలో LSG vs MI జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. దీంతో అందరి దృష్టి ఆ వైపే మళ్ళింది. ఈ ఘటనపై మిశ్రమ స్పందనలు కూడా వచ్చాయని తెలుస్తోంది. అది ఏంటో చూద్దాం. చేంజింగ్ దిగిన ఎమ్ఐ బ్యాటింగ్ చేస్తోంది. 20వ ఓవర్ నడుస్తోంది.

Video Advertisement

ఈ సమయంలో మొదటి బంతికి కృనాల్ పాండ్యా బౌలింగ్ లో పోలార్డ్ భారీ షాట్ యత్నించి క్యాచ్ కి దొరికాడు. దీంతో నిరాశ చెంది వెనుదిరిగి వెళ్ళిపోతున్నా పొలార్డ్ ను ఒక వ్యక్తి వెనకనుండి వచ్చి గట్టిగా హాగ్ చేసుకున్నారు. అతనెవరో కాదు లక్నో బౌలర్ పాండ్య. పొలార్డ్ అవుటై డ్రెస్సింగ్ గదిలోకి వెళ్ళి పోతున్న క్రమంలో కృనాల్, పోలార్డ్ దగ్గరికి వచ్చి ఎగురుకుంటూ అతని వెనక నుండి హాగ్ చేసుకున్నాడు. నీ మీదనే ఆశలు పెట్టుకున్నారు.. అలాంటి నువ్వు కూడా ఇలా ఆడడం, అవుట్ అయి వెళ్లి పోతున్నందుకు థాంక్యూ అన్నట్లుగా కృనాల్ పాండ్యా తీరుచూస్తే అర్థ మవుతుంది. కృనాలు అలా చేయడంపై పోలార్డ్ స్పందించలేదు.

అసలు కోపానికి కూడా రాలేదు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇదివరకు ముంబై ఇండియన్స్ టీమ్ లో కలిసి ఆడిన వారే. వారి మధ్య ఏం లేదు కానీ ఫ్యాన్స్ మాత్రం కోపానికి వస్తున్నారు. వారు పాండ్య చేసిన పనికి ఆశ్చర్యపోయారు. అలాగే కామెంటర్, సీనియర్ ఆటగాళ్లు కృనల్ పై మండిపడుతున్నారు. దీనిపై టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ పార్థివ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ సమయంలో సెండ్ ఆఫ్ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ విధంగా పలువురు క్రికెటర్లు కృనల్ పాండ్య తీరును తప్పుబట్టారు.