ముంబయిలోని బ్రబౌర్న్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి, పంజాబ్ కింగ్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 54 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో లివింగ్‌స్టోన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 24 బంతుల్లో 1 సిక్స్, 4 ఫోర్లతో 33 పరుగుల స్కోర్ చేశారు.
వికెట్ కీపర్ జితేశ్ శర్మ మూడు సిక్సర్లతో 26 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. మయాంక్ 4 (2), రాజపక్స 9 (5), షారూఖ్ ఖాన్ 6 (11), ఓడియన్ స్మిత్ 3 (7), రాహుల్ చాహర్ 12 (8) పరుగులు చేశారు. రబాడా 12 (12), వైభవ్ అరోరా 1 (2) నాటౌట్ గా నిలిచారు.
చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డన్ రెండు వికెట్లు, ప్రిటోరియస్ రెండు వికెట్లు, ముఖేష్ చౌదరి ఒక వికెట్, డీజే బ్రావో ఒక వికెట్, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు. చెన్నై జట్టులో శివమ్ దూబే మూడు సిక్సులు, ఆరు ఫోర్లతో 30 బంతుల్లో 57 పరుగులు చేసి టీమ్ అత్యధిక స్కోరర్ గా నిలిచారు. ధోనీ 23 (28), రాబిన్ ఊతప్ప 13 (10), రుతురాజ్ గైక్వాడ్ 1 (4), మొయిన్ అలీ 0 (2), అంబటి రాయుడు 13 (21), రవీంద్ర జడేజా 0 (3), బ్రావో 0 (1), ప్రిటోరియస్ 8 (4), జోర్డాన్ 5 (5), పరుగులు చేశారు. ముఖేష్ చౌదరి 2 (2) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇంకా పంజాబ్ కింగ్స్ బౌలర్లలో రాహుల్ చాహర్ మూడు వికెట్లు, వైభవ్ అరోరా రెండు వికెట్లు, లివింగ్ స్టోన్ రెండు వికెట్లు పడగొట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18 ఓవర్లలో 126 పరుగుల స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19