“ఇదయ్యా మీ అసలు రూపం..!” అంటూ… KKR Vs CSK లో “ధోనీ” హాఫ్ సెంచరీ చేయడంపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“ఇదయ్యా మీ అసలు రూపం..!” అంటూ… KKR Vs CSK లో “ధోనీ” హాఫ్ సెంచరీ చేయడంపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ 2022 మొదలయ్యింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ కి మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.

Video Advertisement

మొదటి ఓవర్ లో రుతురాజ్ గైక్వాడ్ డకౌట్‌ గా వెనుదిరిగారు. అయిదవ ఓవర్ లో మరొక ఓపెనర్ కాన్వే అవుట్ అయ్యారు. పవర్ ప్లే లో ఓపెనర్లు ఇద్దరూ అవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 131 పరుగుల స్కోర్ చేసింది.  మ్యాచ్ ని నో బాల్ తో ప్రారంభించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లు ఆ తర్వాత పుంజుకున్నారు. ఉమేష్ యాదవ్ చెన్నై ఓపెనర్లని పెవిలియన్ కి పంపారు. తర్వాత ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఒక వికెట్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టారు.

trending memes on dhoni scoring half century in ipl 2022 1st match

సునీల్ నరైన్ వేసిన ఓవర్‌లో అంబటి రాయుడు రనౌట్ అయ్యి వెనుదిరిగారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లలో ఫస్ట్ డౌన్‌గా వచ్చిన రాబిన్ ఊతప్ప స్కోర్ బోర్డ్ ని ముందుకు నడిపించినా కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. శివమ్ దూబే కూడా తక్కువ పరుగులకే అవుటయ్యారు. తర్వాత వచ్చిన ధోని కెప్టెన్ జడేజాతో కలిసి 20 ఓవర్లకు 131 పరుగులు స్కోర్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ధోనీ 50 నాటౌట్ (38), రుతురాజ్ గైక్వాడ్ 0 (4), కాన్వే 3 (8), రాబిన్ ఊతప్ప 28 (21), అంబటి రాయుడు 15 (17), రవీంద్ర జడేజ 26 నాటౌట్ (28) , శివమ్ దూబే 3 (6), పరుగులు చేశారు. ధోనీ హాఫ్ సెంచరీ చేయడం పై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16


End of Article

You may also like