మొదటి ఐపీఎల్ వేలంలో ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ ఎంతకి కొనుగోలు చేసిందో తెలుసా.?

మొదటి ఐపీఎల్ వేలంలో ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ ఎంతకి కొనుగోలు చేసిందో తెలుసా.?

by Megha Varna

Ads

మహేంద్ర సింగ్ ధోని ఒక సక్సెస్ ఫుల్ కెప్టెన్. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కింద ఉండి నాలుగు సార్లు ట్రోఫీని తీసుకు వచ్చాడు ధోని. మొదటి స్థానంలో రోహిత్ శర్మ వున్నాడు. కెప్టెన్ కింద వుంది ఐదు సార్లు ట్రాఫి ని తీసుకు వచ్చాడు రోహిత్ శర్మ.

Video Advertisement

ఇదిలా ఉంటే 2008 లో మొదటి సారి జరిగిన ఐపీఎల్ వేలం లో ధోని ఎలా వచ్చాడో.. వేలంపాట నిర్వహించిన వ్యక్తి మాజీ ఆక్షనీర్ రిచర్డ్ మాడ్లీ ఈ మధ్య గుర్తు చేసుకోవడం జరిగింది. అయితే మరి ఆ విషయాన్ని మనం కూడా ఇప్పుడు చూద్దాం.

ధోనీ టీం లోకి రాగానే ఫ్రాంఛైజీల మధ్య పోటీ మొదలైందట. అయితే రాజస్థాన్ కి షేన్ వార్న్ ని కొనుగోలు చేశారు. అయితే అప్పుడు ఎలాంటి పోటీ కూడా లేదు. కానీ మహేంద్ర సింగ్ ధోని అడుగు పెట్టగానే పోటీ మొదలైంది. వేలం లో పాల్గొన్న జట్లు అన్నీ కూడా ధోనిని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాయి.

2007 T20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియాని గెలిపించిన ధోనీని వేలంలో దక్కించుకోవాలని ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపించినట్టు చెప్పారు మాడ్లీ. కానీ ఆఖరికి సచిన్ టెండూల్కర్ ని ముంబై టీం తీసుకోగా.. చెన్నై ని ధోనీ తీసుకుంది.

అయితే ధోని కి అప్పుడు కనీస ధర నాలుగు లక్షల డాలర్లు అయితే చెన్నై సూపర్ కింగ్స్ 1.5 మిలియన్ డాలర్లకు ధోని ని సొంతం చేసుకుంది. ఇలా 2008 లో మొట్ట మొదటిసారి నిర్వహించిన ఐపీఎల్ వేలం గురించి మరొక సారి గుర్తు చేసుకున్నారు మాడ్లీ. రవి చంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ఈ విషయాలను షేర్ చేసుకున్నారు.


End of Article

You may also like