షార్జా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి, పంజాబ్ కింగ్స్ జట్టుకి శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో మొదట పంజాబ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు స్కోర్ చేసింది. 126 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (2) ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అవ్వగా, తర్వాత వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (1) కూడా తక్కువ స్కోర్ కి అవుట్ అయ్యారు. మరొక ఓపెనర్ సాహా (31: 37 బంతుల్లో 1×4) ఓపికగా క్రీజ్ లో నిలవగా, అతనికి మనీశ్ పాండే (13: 23 బంతుల్లో 1×4), కేదార్ జాదవ్ (12: 12 బంతుల్లో) సహకారాన్ని అందించారు.
ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చిన జేసన్ హోల్డర్ (47 నాటౌట్: 29 బంతుల్లో 5×6) వరుస సిక్సర్లతో దూసుకెళ్లారు. చివరి 12 బంతుల్లో హైదరాబాద్ విజయానికి 21 పరుగులు అవసరం అవ్వగా ఇన్నింగ్స్ 19వ ఓవర్ లో హోల్డర్ ని నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉంచడంలో పంజాబ్ బౌలర్ అర్షదీప్ సఫలం అయ్యారు. ఆ ఓవర్ లో 4 పరుగులు రాగా చివరి ఓవర్ లో ఆఖరి 5 బంతులని హోల్డర్ ఆడినా కూడా ఒక సిక్స్ మినహా పెద్ద షాట్ చేయలేకపోయారు. స్లో డెలివరీలు విసిరిన ఎలిస్, ఒక వైడ్ వేసినా కూడా హోల్డర్ ఒత్తిడి నుండి బయటికి రాలేకపోయారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15