ముంబైతో మ్యాచ్‌లో కోల్‌కతాని గెలిపించిన ఈ వెంకటేష్ అయ్యర్ ఎవరు.?

ముంబైతో మ్యాచ్‌లో కోల్‌కతాని గెలిపించిన ఈ వెంకటేష్ అయ్యర్ ఎవరు.?

by Mohana Priya

Ads

నిన్న జరిగిన ఐపిఎల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు వెంకటేష్ అయ్యర్. “అసలు ఎవరు ఈ వెంకటేష్ అయ్యర్?” అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. వెంకటేష్ ఇండోర్ కి చెందిన వారు. మధ్యప్రదేశ్ జట్టు తరఫున ఆడుతున్నారు. ఈ సంవత్సరం మొదట్లో గోవాతో జరిగిన మ్యాచ్ లో 52 బంతుల్లో 87 పరుగులు చేసి వెలుగులోకి వచ్చారు. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న వెంకటేష్ అండర్-23 టీం కి కెప్టెన్ గా నియమించబడ్డారు.kkr opener venkatesh iyer unknown details

Video Advertisement

ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరిలో పంజాబ్‌తో జరిగిన లిస్ట్-ఎ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో వెంకటేష్ 198 పరుగులు చేశారు. ఈ టోర్నమెంట్ లో వెంకటేష్ స్ట్రైక్ రేట్ 124. దాంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఓపెనర్ గా ఛాన్స్ పొందారు. భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రస్తుత చైర్మన్ సౌరవ్ గంగూలీకి గాడ్ ఆఫ్ ఆఫ్ సైడ్ అనే బిరుదు ఉంది. అంటే ఎంత మంది ఫీల్డర్లను పెట్టినా కూడా వారి మధ్య నుండి కవర్ డ్రైవ్ ఆడేవారు.kkr opener venkatesh iyer unknown details

ఇప్పుడు వెంకటేష్ కూడా గంగూలీని గుర్తు చేశారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గంగూలీలాగా కవర్ డ్రైవ్ ఆడుతున్న లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మెన్‌ వెంకటేష్ అని పొగుడుతున్నారు. గంగూలీ స్వస్థలం కోల్‌కతా. గంగూలీ కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించారు. ఇప్పుడు వెంకటేష్ కూడా అదే జట్టు తరఫున ఆడుతుండడంతో, అతనికి గంగూలీకి చాలా పోలికలు ఉన్నాయి అని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like