- చిత్రం : విక్రమ్ హిట్‌లిస్ట్
- నటీనటులు : కమల్ హాసన్, ఫహాద్ ఫాసిల్, విజయ్ సేతుపతి.
- నిర్మాత : కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్
- దర్శకత్వం : లోకేష్ కనకరాజ్
- సంగీతం : అనిరుధ్ రవిచందర్
- విడుదల తేదీ : జూన్ 3, 2022

స్టోరీ :
సినిమా మొదలవడమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచన్ (కాళిదాస్ జయరామ్) అనే ఒక అమరవీరుడి తండ్రి అయిన కర్ణన్ (కమల్ హాసన్) హత్యకు గురవుతారు అనే విషయంతో సినిమా మొదలవుతుంది. కొంత మంది వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి ఇలాంటి హత్యలు చేశారు అని తేలుతుంది. వ్యవస్థ మీద వారు యుద్ధం చేస్తున్నారు అని, ఆ క్రమంలోనే ఇలా చేస్తున్నారు అని తెలుస్తుంది. జోస్ (చెంబన్ వినోద్ జోస్) అనే ఒక పోలీస్ చీఫ్ చెప్పడంతో అమర్ (ఫహాద్ ఫాసిల్) నేతృత్వంలో ఉన్న ఫోర్స్ ఈ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో అమర్ కర్ణన్ జీవితానికి సంబంధించిన విషయాలని తెలుసుకుంటూ ఉంటాడు. కానీ కర్ణన్ ఎలాంటి వ్యక్తి అనే విషయాన్ని మాత్రం అమర్ తెలుసుకోలేకపోతాడు. మరొక పక్క సంతానం (విజయ్ సేతుపతి) ఎన్నో వ్యాపారాలు నడుపుతూ ఉంటాడు. అసలు కర్ణన్ ఎవరు? కర్ణన్ కి తన కొడుకు అంటే నిజంగానే ఇష్టమా? కర్ణన్ చనిపోయాడా? బతికే ఉన్నాడా? ఈ విషయాలన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో కూడా పేరు సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. లోకేష్ కనకరాజ్ కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తున్నారు అనగానే ఆసక్తి మొదలైంది. సాధారణంగా కమల్ హాసన్ సినిమా అంటే తెలుగులో కూడా విడుదల అవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం కేవలం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాకుండా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అయ్యింది. కమల్ హాసన్ ని ఒక మంచి యాక్షన్ రోల్ లో చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. గత కొద్ది సంవత్సరాలుగా కమల్ హాసన్ ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నారు. తనలో ఉన్న నటుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ లోని యాక్షన్ హీరో మరొకసారి బయటికి వచ్చారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా అమర్ పాత్ర పోషించిన ఫహాద్ ఫాసిల్ పాత్రతోనే నడుస్తుంది.

సినిమా చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. నెక్స్ట్ ఏమౌతుంది అని ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. లోకేష్ కనకరాజ్ అంటే సాధారణంగా కార్తీ హీరోగా నటించిన ఖైదీ సినిమా గుర్తొస్తుంది. కానీ మధ్యలో మాస్టర్ సినిమాతో కమర్షియల్ సినిమా కూడా చేశారు. మళ్లీ విక్రమ్ సినిమాలో ఖైదీలో ఉన్నట్టుగానే చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. సినిమా ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే, అనిరుధ్ అందించిన సంగీతం మరొక ఎత్తు. అలాగే సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడుస్తుంది. నిడివి ఇంకా కొంచెం తక్కువ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- యాక్షన్ సీన్స్
- మ్యూజిక్
- కొన్ని సీన్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- అక్కడక్కడా స్లోగా అనిపించే ఫస్ట్ హాఫ్
- సినిమా నిడివి
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్షన్ సినిమా చూసిన ఫీల్ వస్తుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని, అలాగే కమల్ హాసన్ ని చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి పవర్ ఫుల్ రోల్ లో చూడాలి అనుకునే వారిని విక్రమ్ అస్సలు నిరాశ పరచదు. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి స్టోరీ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుంది.










































ఆయన ఏ సాంగ్ పాడిన అంకితభావంతో పని చేస్తారని పేరు ఉంది. ఆయన గొంతు నుంచి వెలువడిన ఏ పాట అయినా మంచి గుర్తింపు పొందింది. కోట్ల మంది భారతీయుల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు కే కే. 53 సంవత్సరాల వయసులో మన అందరికీ దూరమయ్యారు. కోల్‌కతాలోని ఒక కళాశాలలో స్టేజ్ పై ప్రదర్శన ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

ఈ సినిమా చూస్తున్నంత సేపు కేకలు, అరుపులు, గూస్ బంప్స్ వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సెకండాఫ్ లో మనం చూస్తున్నంత సేపు రియల్ ఉన్నికృష్ణన్ చూసినట్టే అనిపిస్తుంది. ఇందులో భయం, బాధ, కోపం ముఖ్యంగా ఉద్వేగం ఇవన్నీ మనకు వచ్చేలా రాసుకున్నారు స్క్రిప్ట్. ఇది శేష్ సినీ జీవితంలో మంచి సినిమాగా మిగిలిపోతుంది అని చెప్పవచ్చు. ఇక మూవీ చూస్తే మాత్రం మీకు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది. సాంగ్స్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ అని చెప్పవచ్చు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా కలిసివస్తుందని చెప్పవచ్చు. మొత్తానికి ఈ మూవీలో మేజర్ సందీప్ ని ఒక సూపర్ హీరోలా ఫీల్ అవడం ఖాయం. అలా మనం ఫీల్ అయ్యేలా ఈ సినిమాను తీశారు. ఫైనల్ గా మనం ఒక నిజమైన మేజర్ ఎలాంటి కష్టం పడతాడో సినిమా చూస్తే కొంతవరకు అర్థమవుతుంది. ఈ మూవీని దర్శకుడు శశి కిరణ్ తిక్క, తెరకెక్కించారు. నిర్మాత మహేష్ బాబు, హీరో అడివి శేష్, హీరోయిన్ శోభితా ధూళిపాళ, మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, రచయిత అడివి శేష్, నటీనటులు ప్రకాష్ రాజ్, సాయి మంజ్రేకర్, ఈ మూవీ జూన్ 3వ తేదీన థియేటర్లోకి రానుంది.
దాని వెంటనే హీరో నానితో శ్యాం సింగరాయ్ సినిమాలో నటించి సక్సెస్ ఫుల్ కథానాయికగా మారింది కృతి. ఇదే స్ఫూర్తితో మరెన్నో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే హీరో సూర్యా 41వ సినిమాలో ప్రస్తుతం నటిస్తోంది. ఈ క్రమంలోనే కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమె ఇంటర్వ్యూ చేసింది ఫ్రాంక్ స్టార్లు ఆశిక్ మరియు సారథిరన్. ఈ సందర్భంలో వారిద్దరూ ప్రశ్నలు నేను అడుగుతాను అంటే కాదు నేను అడుగుతాను అనుకుంటూ ఒకరిపై ఒకరు తీవ్రంగా అరుచుకుంటూ కేకలు వేస్తూ ఆమె ముందే కొట్లాటకు దిగారు.








