అవును మీరు చూస్తున్నది, చదువుతున్నది నిజమే..! మనుషుల్లో చాల అరుదుగా వచ్చే ఈ సమస్య, బీహార్ కి చేయించిన ఈ కుర్రాడు నితీష్ వయసు 17 సంవత్సరాలు.. మూడు గంటలు ఆపరేషన్ లో తన దవడ లో నుంచి సుమారు 82 దంతాలని (పళ్ళు) ని డాక్టర్లు ఆపరేషన్ ద్వారా తీసివేశారు. నితీష్ కుమార్ అనే ఈ యువకుడికి కాంప్లెక్స్ ఒడొంతోమా అనే వ్యాధి సుమారు అయిదు సంవత్సరాలుగా ఉంది.

ఒక మనిషికి ఉండాల్సిన దంతాల కంటే ఎక్కువ ఉన్న ఈ కుర్రాడికి అరుదైన వ్యాధితో ఇబ్బంది పడ్డాడు.ఈ ఆపరేషన్ బీహార్ లోని ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో నిర్వహించారు. డాక్టర్ ప్రియాంకర్ సింగ్ ముఖము, దవడల సంబంధిత స్పెషలిస్ట్, జావేద్ ఇక్బాల్ అనే డాక్టర్ సహాయం తో సుమారు మూడు గంటలు కష్టపడి ఈ కుర్రాడికి ఆ సమస్య నుంచి విముక్తి కలిగించారు. ఆపరేషన్ కి ముంది వైద్యులని సంప్రదించిన నితీష్ కుమార్ స్కానింగ్ లో ఎక్కువగా ఉన్న దంతాలని కనుగొన్నారు. దీని కారణం చేత తన ముఖ దవడ భాగాలు వాపుగా కనిపించాయి. తాను గత కొంత కాలంగా ఎలాంటి చికిత్స తీసుకోనందునే ఇలా జరిగింది అంటూ డాక్టర్స్ చెప్పారు.
also Read: భార్య “వేషాలు” చూడలేక ఆత్మహత్య చేసుకున్న భర్త.. అసలేమైందంటే..?












































