ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు విపరీతంగా వైరల్ అయిపోతాయి. తాజాగా ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఆ వీడియోలో ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది పెళ్లి అయినా సరే మరొకరితో సహజీవనం చేస్తూ ఉంటారు.
ఒక్కొక్క సారి ఇటువంటి వాళ్ళు భార్య చేతిలో బుక్ అయి పోతూ ఉంటారు. ఇలాంటివి మనం తరచూ వింటూనే ఉంటాం. అదే పరిస్థితి ఈ వ్యక్తికి ఎదురైంది. కర్వా చౌత్ రోజున ప్రియురాలి తో పాటు షాపింగ్ కి వెళ్తాడు ఒక వ్యక్తి.
అక్కడికి తన భార్య వస్తుంది ఇంకేముంది అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. తనకు తన భార్య కి మధ్య గొడవ అవ్వడంతో ఆమె పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే ఉంటుంది. పుట్టింటికి వెళ్ళిన ఆమె తన తల్లితో పాటు మార్కెట్ కి వచ్చింది. అక్కడ తన భర్త మరో అమ్మాయితో షాపింగ్ కి వస్తాడు ఇంకేముంది మార్కెట్ లో అందరి ముందు తన భార్య కాలర్ పట్టుకుని ఎడాపెడా వాయించేస్తుంది.
అలానే ఆమె తరపు వాళ్లందరూ కూడా తనని కొట్టడం మొదలుపెట్టారు. ప్రియురాలు కూడా అతన్ని నాలుగు పీకింది. మార్కెట్లో ఈ సంఘటన జరగడంతో అక్కడ ఉన్న జనం వచ్చేసారు. తర్వాత అతని భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది.
మామూలుగా కర్వా చౌత్ అంటే భర్తల కోసం పూజలు చేస్తూ ఉంటారు. భర్త ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈమె ఏకంగా భర్తని పండుగ అని కూడా చూడకుండా ఎడాపెడా వాయించేసింది. మరి భర్తని కొట్టిన భార్య వీడియోని మీరు కూడా చూడండి. నిజానికి ఇలాంటి వాళ్ళకి ఇదే విధంగా బుద్ధి చెప్పాలి అప్పుడైనా బుద్ధి వస్తుందేమో చూడాలి.
On Karwa Chauth, Husband Gets Thrashed by Wife and Mother-in-Law After Getting Caught Red-Handed Shopping With Girlfriend in Ghaziabad pic.twitter.com/DGFm1ZWjPk
— Subodh Srivastava (@SuboSrivastava) October 13, 2022