చాణక్య నీతి: ఈ 5 లక్షణాలు మీలో ఉంటె.. మీరు ఎలాంటి సమస్యని అయినా సాల్వ్ చేసేస్తారు..!

చాణక్య నీతి: ఈ 5 లక్షణాలు మీలో ఉంటె.. మీరు ఎలాంటి సమస్యని అయినా సాల్వ్ చేసేస్తారు..!

by Anudeep

Ads

చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రం లో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయిత గా, సలహాదారుని గా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి.

Video Advertisement

Chanakya about problem solving skills

ఆయన పలు విషయాలలో ఎలా నడుచుకోవాలో.. సమస్యలు వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో తన చాణక్య నీతి పుస్తకంలో వివరించారు. ఎలాంటి సమస్యలను అయినా ఎదుర్కోవడానికి మనలో కనీసం ఐదు లక్షణాలు ఉండాలట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

స్పష్టత: ఏదైనా పని చేసేముందు మీరు ఏమి చేయాలనుకున్నారు..? దాని వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది అన్న విషయమై మీకు స్పష్టత ఉండాలట. ప్రతి పని చేసేముందు ఈ పని ఎందుకు చేస్తున్నాం? అన్న ప్రశ్నకి సరైన సమాధానం ఉండాలట. అప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ పనిని పూర్తి చేయడానికే ప్రయత్నిస్తారట.

chanakya neethi 4

శక్తి సామర్ధ్యాలు: మీ శక్తి సామర్ధ్యాల గురించి మీకు ఓ అంచనా ఉండాలి. దానిని బట్టి మీరు ఎంచుకోవాల్సి పనిపై కూడా మీకు స్పష్టత వస్తుంది. మీ పై మీకు ఉండే అంచనా మీరు చేయాలనుకున్న పనికి తగిన ప్రణాళికను రూపొందించగలుగుతారు.

సహనం: ఎలాంటి పరిస్థితిలో అయినా ఓర్పుగా ఉండడం చాలా అవసరం. జీవితంలో ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమయంలో ఓర్పుగా వ్యవహరించగలిగితే ముందు ముందు మంచి రోజులు వస్తాయి.

chanakya nithi

ఆలోచన: గడ్డు పరిస్థితులు ఎదురుకాగానే ఆందోళన చెందకండి. సరైన రీతిలో ప్రవర్తించగలిగే ఆలోచనా విధానాన్ని అలవర్చుకోండి.

దురాశను అధిగమించడం: దురాశ, వ్యామోహం వంటివి మనిషి పతనానికి కారణాలు. వీటిని సమర్ధవంతంగా అధిగమించగలిగితే మీరు జీవితంలో ఓ మెట్టు పైకి ఎక్కగలుగుతారు.


End of Article

You may also like