ఆడవాళ్ళ వ్యక్తిత్వానికి, మగవాళ్ల వ్యక్తిత్వానికి ఉండే తేడాలేంటి..? చాణక్య నీతి ఏమి చెబుతోందంటే..?

ఆడవాళ్ళ వ్యక్తిత్వానికి, మగవాళ్ల వ్యక్తిత్వానికి ఉండే తేడాలేంటి..? చాణక్య నీతి ఏమి చెబుతోందంటే..?

by Anudeep

Ads

చాణుక్యుడు భారతీయులందరికి సుపరిచుతుడే. అర్ధశాస్త్రాన్ని ఔపోసన పట్టి, సకల రాజనీతి జ్ఞానాన్ని సముపార్జించిన వాడు చాణుక్యుడు. అర్ధశాస్త్రాన్ని రచించింది ఈయనే అని మనకి తెలిసినదే. ఈయన రచయిత గా, సలహాదారుని గా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. ఈయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ఆచరించుకుని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

Video Advertisement

chanakya 1

ఆయన రచించిన చాణక్య నీతి ఇప్పటికీ ప్రముఖం గా వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. స్త్రీ, పురుషులు సమానం అని.. ఇద్దరికీ ఒకేరకమైన హక్కులు ఉండాలని భావిస్తూ వస్తున్నారు. ఈ విషయమై చాణుక్యుడు ఎలాంటి వివరణ ఇచ్చారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

chanakya 2

స్త్రీణాం ద్విగుణ ఆహారో బుధ్ధిస్తానం చతుర్గుణా
సాహసం షడ్గుణం చైవ కామోఒష్ణగుణ ఉచ్యతే”

అన్న శ్లోకాన్ని చాణుక్యుడు ఉదహరించారు. ఈ శ్లోకం లో కేవలం స్త్రీల స్వభావం గురించి చెప్పబడింది. ఆడవారు గర్భం దాల్చి మరో ప్రాణికి ప్రాణం పోస్తారు. అందుకే వారు తీసుకునే ఆహరం మగవారు తీసుకునే ఆహరం కంటే ఎక్కువ ఉంటుంది. పురుషుల కంటే.. స్త్రీల బుద్ధి మెండు గా ఉంటుంది. ఈమధ్య యూనివర్సిటీలు, కాలేజీలలో కూడా.. మగవారికంటే ఆడవారే ఎక్కువ మేధస్సు ని కనబరుస్తున్నారన్న సంగతి తెలిసిందే.

chanakya 3

ఒక పురుషుడు పరిపూర్ణత చెందిన యువకుడు అవ్వాలంటే పాతికేళ్ళు నిండాలి. కానీ స్త్రీ 16 సంవత్సరాలకే పరిపూర్ణత చెందిన యువతి గా ఎదుగుతుంది. ఒక పురుషుడు తన పాతికేళ్ల కాలం లో నేర్చుకునే విషయాలను స్త్రీ పదహారేళ్లకు నేర్చుకుంటుంది. ఇంట్లో ఉండే ఆడవారు వంటపనులు, ఇంటి పనులు చేసుకోవడమే కాక.. దారాలతో స్వెట్టర్లు అల్లడం, కుట్టడం, కుట్లు వంటివి నేర్చుకుంటూ.. మరొకరితో ముచ్చట్లు వేస్తూ ఉంటారు. అంటే ఒకే టైం లో రెండు, మూడు పనులను అవలీల గా చేసేస్తూ ఉంటారు. ఇక పురుషుల తో పోలిస్తే.. స్త్రీలలో సాహసం చేసే తెగువ ఎక్కువ ఉంటుంది. శారీరక దృష్టి పరం గా చూసినా కూడా స్త్రీలకు పురుషులతో పోలిస్తే ఎక్కువ కోరికలు ఉంటాయట.


End of Article

You may also like