Ads
చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది.
Video Advertisement
ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది.
మనిషి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఓ మూడు విషయాలకు దూరంగా ఉండాలని చాణుక్యుడు చెబుతున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
# వ్యసనం: జీవితంలో పైకి ఎదగాలంటే ప్రతి మనిషి వ్యసనాలకు దూరంగా ఉండాలి. వ్యసనాలు మనలను మానసికంగానూ శారీరకంగానూ బలహీనం చేస్తాయి.
# చెడు సావాసాలు: యవ్వనం మనిషి ఎదగడానికి ఎంతగానో దోహదం చేసే సమయం. ఆ సమయంలో చెడు సావాసాలు ఏర్పరుచుకోవడం అస్సలు మంచిది కాదు. చెడు సావాసాలు వల్లే వ్యసనాలు అలవాటు అవుతాయి. డబ్బు, సమయం వృధా అవుతుంది. అందుకే మంచి స్నేహితులు ఉండాలని పెద్దలు చెబుతుంటారు. మంచిని రూపాయి ఇచ్చి అయినా తెచ్చుకోవాలని, చెడుని రూపాయి ఇచ్చి అయినా వదిలించుకోవాలని చాణుక్యుడు చెబుతున్నారు.
# సోమరితనం: ఎంత మంచి ప్రతిభ ఉన్న వారికయినా సోమరితనం ఒక శాపం. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వారు సోమరితనాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.
ఈ మూడు విషయాలలోనూ దూరం గా ఉండి తన జీవిత లక్ష్యాలకు మార్గం సుగమం చేసుకునే వ్యక్తి తన జీవితంలో తొందరగా సక్సెస్ అవుతాడు. మనం మంచిగా ఉండాలంటే.. మన స్నేహితులను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వారి ప్రభావం మనపై చాలా ఉంటుంది కాబట్టి.
End of Article