Ads
చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.
Video Advertisement
చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు స్నేహితుల గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు.
అలాగే భార్యా భర్తల గురించి కూడా చాణుక్యుడు చాలా విషయాలనే చెప్పాడు. ముఖ్యంగా ప్రతి పురుషుడు సంసారంలో ఎలా మసలుకోవాలి అనే విషయాలను కూడా వివరించాడు. ప్రతి భర్త.. తన భార్యా పిల్లల ముందు కొన్ని పొరపాట్లు చేయకూడదు అని హితవు చెప్పాడు. ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
# భాష:
ప్రతి పురుషుడు ఇంట్లో మాట్లాడేటప్పుడు తన భాష విషయంలో జాగ్రత్త వహించాలి. అనైతికంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ మాటతీరు వలన పిల్లలు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వారి భావి జీవితాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంటుంది.
# తెలివితక్కువ పనులు చేయడం:
భార్య ముందు తెలివితక్కువగా ప్రవర్తించకూడదు. అలాగే వాటిని కప్పిపుచ్చుకోవడానికి కఠినంగా మాట్లాడడం, కొట్టడం వంటి పనులు చేయకూడదు. ఇట్లా చేయడం వలన ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. ఫలితంగా భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చాణుక్యుడు చెప్పుకొచ్చాడు.
# అహంకారం:
అలాగే ప్రతి పురుషుడు తన ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. అనవసరంగా కోపం, అహంకారం ప్రదర్శించడం వలన ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత సానుకూలంగా ప్రవర్తిస్తూ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని నెలకొల్పాలి.
End of Article