చాణక్య నీతి: ఈ 5 విషయాలు బంగారం లాంటి స్నేహం లో చిచ్చు పెడతాయి.. జాగ్రత్త పడండి..!

చాణక్య నీతి: ఈ 5 విషయాలు బంగారం లాంటి స్నేహం లో చిచ్చు పెడతాయి.. జాగ్రత్త పడండి..!

by Anudeep

చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రం లో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయిత గా, సలహాదారుని గా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి.

Video Advertisement

chanakya 2

చాణక్య నీతిలో నేటి నవ జీవనానికి అవసరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. సమాజంలో మనిషి మనుగడకు తిండి, బట్ట, గూడు ఎంత అవసరమో.. స్నేహం కూడా అంతే అవసరం. మనిషి సంఘజీవి. ఇరుగు పొరుగు వ్యక్తులతో స్నేహంగా మెలుగుతూ.. జీవనం సాగిస్తూ ఉంటాడు. ప్రతి మనిషికి కష్టంలో ఆదుకోవడానికి కనీసం ఒక్క స్నేహితుడు అయినా ఉండాలి అంటూ ఉంటారు. అయితే.. మనకి ఉన్న స్నేహితులని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. స్నేహంలో ఎటువంటి కలతలు, గొడవలు, మనస్పర్థలు రాకుండా జాగ్రత్త పడాలి.

అయితే.. ఒక ఐదు విషయాలు స్నేహంలో చిచ్చులు రేపుతాయని.. వాటి విషయంలో జాగ్రత్తపడాలి అని చాణుక్యుడు తెలిపాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

friends 1

# స్వార్ధం: అవతలి వ్యక్తి నుంచి ఏమి ఆశించకుండా ఉండేదే నిజమైన స్నేహం. ఎప్పుడైతే స్నేహంలో కూడా దురాశ కారణంగా స్వార్ధాన్ని చూపిస్తామో.. అప్పుడే ఆ స్నేహం బీటలు వారుతుంది. స్వార్ధంగా ఉండే వ్యక్తులతో స్నేహం చేయడానికి కూడా ఎవరూ ముందు రారు.

# మోసం: అసలు స్నేహం అనేదే నమ్మకం అనే పునాదిపై నిలుస్తుంది. ఎప్పుడైతే వంచనకు చోటు దొరుకుతుందో..అప్పుడే ఆ స్నేహం అనే బిల్డింగ్ కూలిపోతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర నమ్మకం లేకుండా స్నేహం నిలబడదు.

friends 2

# అబద్ధాలు: బంగారంలాంటి స్నేహం చెడిపోవడానికి మొదటగా దోహదం చేసే కారణం అబద్ధాలు. అబద్ధాలు చెప్పడం వలన ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. మీరు చెప్పింది అబద్ధం అని తెలిసినప్పుడు మీ స్నేహితుడికి మీపై ఇష్టం పోతుంది. ఫలితంగా మీ స్నేహ బంధం బలహీనపడుతుంది.

# అగౌరవపరచడం: మానవ సంబంధాలలో ప్రతి బంధానికి విలువ ఇవ్వాల్సిందే. గౌరవం లేని చోట ఏ బంధం నిలబడదు. స్నేహం కూడా అంతే. పరస్పరం గౌరవాన్ని ఇచ్చి పుచ్చ్చుకోవడం మరిచిపోతే వ్యక్తుల మధ్య స్నేహం చెడిపోతుంది.

friends 3

# విలువలు లేకపోవడం: మనిషికి గౌరవం ఇచ్చినట్లే.. బంధానికి విలువ, ప్రాముఖ్యతని కూడా ఇవ్వాలి. ఈ సూత్రం స్నేహం విషయంలో కూడా వర్తిస్తుంది. విలువలు లేని స్నేహం ఎక్కువ కాలం నిలబడదు. కేవలం అవసరం ఉన్నంతకాలము అది నడుస్తుంది. స్నేహం ఎక్కువ కాలం పాటు నిలబడాలంటే.. స్నేహితులు పరస్పరం గౌరవించుకుంటూ.. వారి స్నేహ బంధానికి విలువనివ్వాలి.


You may also like