చాణక్య నీతి: ఈ 4 విషయాల్లో స్త్రీలు పురుషుల కంటే ముందుంటారట.. అవేంటంటే?

చాణక్య నీతి: ఈ 4 విషయాల్లో స్త్రీలు పురుషుల కంటే ముందుంటారట.. అవేంటంటే?

by Anudeep

Ads

చాణుక్యుని గురించి తెలియని వారు ఉండరు. సామాజిక జీవితం లో మనిషి మనుగడ సాగించడానికి ఆయన చెప్పిన నీతి వాక్యాలు ఎంతగానో అవసరం అవుతాయి. జీవితం లో ఒక్కసారి అయినా ఆయన ఏమి చెప్పారో అన్న విషయాన్నీ గుర్తు చేసుకోకుండా మనం ఉండలేము. అలాగే.. ఆయన అమ్మాయిల గురించి ఏమి చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

chanakya

1. ఆయన చెప్పిన సూత్రాల ప్రకారం.. ఆడవారు మగవారి కంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారట. “స్త్రీనాం దివ్గుణ ఆహారో” అని ఆయన “చాణక్య నీతి” అనే పుస్తకంలో రాసారు. మహిళలు పురుషుల కంటే ఎక్కువగా కష్టపడి పని చేస్తూ ఉంటారని.. అందుకే వారికి పురుషలకంటే రెండింతలు ఎక్కువగా ఆకలి వేస్తుందని చాణక్యుడు చెప్పుకొచ్చారు.

2. పురుషుల కంటే స్త్రీలు చాలా విషయాలలో నిగ్రహంగా ఉండగల్గుతారట. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి స్పందించడంలో స్త్రీలు పురుషుల కంటే చాలా మెరుగ్గా ఉంటారట. స్త్రీలు పురుషుల కంటే కనీసం ఎనిమిది రెట్లు ఎక్కువగా నిగ్రహంగా ఉంటారట.

3. పురుషుల కంటే స్త్రీలు ఆరు రెట్లు ఎక్కువగా ధైర్యవంతంగా ఉంటారట.

4. అలాగే , తెలివితేటల్లో కూడా పురుషులకంటే స్త్రీలలో ఎక్కువ తెలివితేటలు ఉంటాయట. వారికి ఉన్న తెలివితేటలను అమలు పరచడంలో పురుషులకంటే మెరుగ్గా ఉంటారట. వారి తెలివితేటలతో ఎదురైన సమస్యల్ని సమర్ధవంతంగా పరిష్కరించుకుంటారట.


End of Article

You may also like