Ads
చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది.
Video Advertisement
చాణక్యుడు సామాన్యుల జీవితం గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. చాణుక్యుడు చెప్పిన ముఖ్యమైన విషయాలలో కొన్నిటిని మనం ఇప్పుడు చెప్పుకుందాం.
చాణుక్యుడు చెప్పిన దాని ప్రకారం.. ఈ ఐదు సంకేతాలు మీకు కనిపిస్తే మీ ఇంట్లో బ్యాడ్ టైం స్టార్ట్ అవుతోందని అర్ధమట. ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి మొక్క వాడిపోవడం:
హిందువులలో చాలా మంది ఇంట్లో తులసి మొక్కను కచ్చితంగా పెంచుకుంటూ ఉంటారు. అయితే.. ఎంతో పవిత్రంగా భావించబడే ఈ మొక్క కొన్ని సంకేతాలను తెలియబరుస్తూ ఉంటుందట. ఇంట్లో తులసి మొక్క వాడిపోతే.. ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట.
గొడవలు:
ఇంట్లో ఎప్పుడు లేని విధంగా ప్రతిరోజు గొడవలు వస్తున్నాయా? అటువంటి ఇంట్లో లక్ష్మి దేవి ఇంట్లో నిలవదట. దీనివల్ల మీ ఆర్ధిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చాణక్యనీతి చెబుతోంది.
గాజు పగులుట:
ఎప్పుడో ఒకసారి పొరపాటున గాజు వస్తువులు పగులుతూ ఉంటాయి. కానీ, తరచుగా మీ ఇంట్లో వారి చేతుల్లో గాజు వస్తువులు పగిలిపోతున్నాయా? అయితే.. మీరు జాగ్రత్త పడాలని చాణక్య నీతి చెబుతోంది. ఇలా పదే పదే జరిగితే మీ ఆర్ధిక పరిస్థితి ప్రభావితం అవుతుంది అని సంకేతమట.
పూజలు లేకపోవడం:
ఇంట్లో నిత్యం దీపారాధన, దైవ పూజ జరుగుతూ ఉండాలి. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆనందం, శ్రేయస్సు కోసం నిత్యం భగవంతుడిని వేడుకోవాలి. ప్రతి రోజు లక్ష్మి దేవికి నమస్కరించుకోవాలి. అటువంటి పూజ, పునస్కారాలు లేని చోట లక్ష్మి దేవి నిలవదు.
పెద్దలను అవమానించడం:
ఇంట్లో పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలి. వారిని అవమానిస్తే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు అన్నవి ఉండవు. అటువంటి చోట లక్ష్మి దేవి నివసించడానికి ఇష్టపడదు. అందుకే పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలి.
End of Article