Ads
చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది.
Video Advertisement
ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది.
చాణుక్యుడు తన చాణక్య నీతిలో కుటుంబంలోని ఇంటి పెద్దలు ఎలా నడుచుకోకూడదో కూడా వివరించారు. భారత దేశంలో ప్రస్తుతం ఎక్కువ పితృస్వామ్య వ్యవస్థే నడుస్తోంది. ఇంట్లో పిల్లలు ముఖ్యంగా ఇంట్లోని పెద్దలని చూసే అనుకరిస్తూ ఉంటారు. అందుకే పెద్దలు తమ ప్రవర్తన పట్ల జాగరూకతతో వ్యవహరించాలి. ఇంటి పెద్ద ఎల్లప్పుడూ అందరితో ఉత్తమ సంబంధాలను నడుపుతూ ఉండాలి.
ఇంటి పెద్దలు ఎల్లప్పుడూ ఆహారాన్ని వృధా చేయకూడదు. ఆహారాన్ని గౌరవించాలి. దీనిని పెద్దలు ఆచరించి పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఎంత అవసరమో అంతే పెట్టుకోవాలి. పిల్లలు కూడా పెద్దలని చూసే నేర్చుకుంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తప్పనిసరి. అలాగే అందరితోనూ సరదాగా మాట్లాడాలి. కేవలం అధికారం చూపడం కాకుండా.. అందరి మాటలను వినాలి, చర్చించాలి.
అలాగే ఇంటి పెద్ద ఎప్పుడూ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి. ఒక్కోసారి వృధా ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే డబ్బుని ఆదా చేసుకోవాలి. అవి కష్ట సమయాల్లో ఆదుకుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎక్కువ సార్లు ఆలోచించుకోవాలి. ఎప్పుడూ తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకూడదు.
End of Article