రజినీ కాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రలగా నటించిన సినిమా చంద్రముఖి. 2005లో వచ్చిన ఈ సినిమా ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే దాదాపు 18ఏళ్ల తర్వాత చంద్రముఖికి సీక్వెల్‌గా చంద్రముఖి 2 రాబోతుంది.

Video Advertisement

పి.వాసు దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఇప్పటికీ వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమా అంచనాలను పెంచాయి. అయితే రజినీ ప్లేస్‌లో రాఘవ లారెన్స్, జ్యోతిక ప్లేస్‌లో కంగన రౌనత్ చంద్రముఖి 2లో కనిపించనున్నారు.

Chandramukhi 2 Movie

అయితే ఇప్పటికే అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కానీ రొటీన్‌గా ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో లారెన్స్ వస్తే పర్లేదు.. కానీ పాత కాన్సెప్ట్ అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదని నెటిజన్లు అంటున్నారు. దానికి తోడు సినిమా రన్‌టైమ్ కూడా ఎక్కువగానే ఉంది. సాధారణంగా సినిమా రెండున్నర గంటలు ఉంటుంది.

కానీ ఈ సినిమా రన్‌టైమ్ 170 నిమిషాలు. అంటే 2గంటల 50నిమిషాలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తున్నారు. చంద్రముఖిలా భారీ హిట్ కొడుతుందో లేదో చూడాలి.