1995 vs 2020: అప్పటికి ఇప్పటికీ మన లైఫ్ స్టైల్ ఎలా మారిందో ఈ 10 చూడండి.!

1995 vs 2020: అప్పటికి ఇప్పటికీ మన లైఫ్ స్టైల్ ఎలా మారిందో ఈ 10 చూడండి.!

by Anudeep

Ads

సంవత్సరం మారుతున్న కొద్దీ మనలో మనకే చెప్పలేని మార్పులు వస్తుంటాయి. కొన్నిటిని మనమే గమనించుకుని రియలైజ్ అవుతుంటాం. కొన్ని మన పక్కన వాళ్ళు చెబితే కానీ ఆలోచించలేము. అలాంటిది.. మనలాంటి వ్యక్తులు ఉన్న సమాజం లో కాలానుగుణం గా ఎన్నో మార్పులు వస్తుంటాయి కదా.. అవేంటో మనం ఓ సారి లుక్కేద్దాం..

Video Advertisement

#1. ఒకప్పుడు ఇంట్లోని ఆడవారు ఎలాంటి జిమ్ లకు వెళ్లకపోయినా నాజూకుగా ఆరోగ్యం గా ఉండేవారు. దానికి కారణం ఇంట్లో ఉండే పని, పని చేయడానికి ఉపయోగించే సాధనాలు. కానీ, ఇప్పుడు..? అన్నిటికి మెషీనులే కదా.. చివరికి కాఫి కలపడానికి కూడా మనం మెషిన్ లను వాడేస్తున్నాం.

1 then and now

#2. ఒకప్పుడు చిన్న పిల్లలు పతంగులు ఎగురవేస్తూ ఆరోగ్యం గా ఆడుకునే వారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. రిమోట్ కంట్రోల్ తో ఏరోప్లేన్ ను ఎగురవేస్తూ ఆడుకుంటున్నారు. టెక్నాలజీ అండి మరీ టెక్నాలజీ కాలం ఇది.

2 then and now

#3.ఒకప్పుడు రంగు రంగుల డిజైన్ లు ఉన్న దుస్తులు వేసుకోవడం ఫ్యాషన్ గా ఉండేది. కానీ ఇప్పడూ ఒళ్ళంతా రంగులతో టాటూలు, ప్లైన్ గా ఉండే దుస్తులు ఫ్యాషన్ అయి కూర్చున్నాయి.

3 then and now

#4.ఇది నైంటీస్ కిడ్స్ కి బెస్ట్ మెమరీ. చిన్నప్పుడు ఆరు బయట ఆటలాడి, మండుటెండలో కూడా ఆడుతూనే ఉండేవాళ్ళం. వెంటనే అమ్మ వచ్చి ఇంట్లో కూర్చో..ఎండలో తిరగకు అంటూ బలవంతం గా ఇంట్లోకి లాక్కొచ్చి మరీ కుర్చోపెట్టేది. ఇప్పుడు సీన్ రివర్స్. వీడియో గేమ్స్ పుణ్యమా అని ఇప్పుడు జనరేషన్ పిల్లలు సూర్యుడిని చూడడమే మానేశారు. అంతో ఇంతో ఎండ తగలాలి కదండీ మరి. కాలం మారింది అని అనుకోవాలి అంతే.

4 then and now

#5. ఒకప్పుడు టివి లు ఎలా ఉండేవో గుర్తుందా.. ఓ మినీ సైజు వాటర్ ట్యాంక్ లా చాలా లావు గా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. మనం ఏమో లావు గా అయిపోతున్నాం. మన టివి లు మాత్రం చాలా స్మార్ట్ గా తయారవుతున్నాయి. ట్రెండ్ అంటే అంతే..ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం.

5 then and now

#6. ఒకప్పుడు ఇళ్లలో ఒక ల్యాండ్ లైన్ ఉంటేనే గొప్ప. ఆ ఉన్న ఒక్క ఫోన్ ఎప్పుడు మోగుతుందా.. అని కుటుంబం మొత్తం ఎదురు చూసేది. బంధాలను ల్యాండ్ లైన్ కలిపి ఉంచేది. అందరిని కలుసుకోవడానికి, గుర్తొచ్చినపుడు మాట్లాడుకోవడానికి ల్యాండ్ లైన్ ను  ఉపయోగించే వారు. కానీ, ఇపుడు పరిస్థితి మారింది. స్మార్ట్  ఫోన్ లు వచ్చాక ఎవరి ప్రాపంచం వారిదైపోయింది. ల్యాండ్ ఫోన్ లు కుటుంబాల్ని కలిపితే, స్మార్ట్ ఫోన్ లు మాత్రం కుటుంబాల్ని విడతీస్తున్నాయి.

6 then and now

#7. మనం న్యూస్ చదవడమే మర్చిపోయాం. ఫేస్ బుక్ ఓపెన్ చేస్తేనో, లేక పొతే రకరకాల న్యూస్ ఆప్ ల ద్వారా వచ్చే న్యూస్ నో చదవడమే తప్ప ఓ పేపర్ కొనుక్కుని తీరిగ్గా ఏ కాఫీ నో తాగుతూ చదివే అలవాటు గాని, తీరిక గాని ఇప్పటి జెనెరేషన్ కి లేనే లేవు.

7 then and now

#8. చిన్నప్పుడేమో మా అమ్మ, మా అమ్మ అని కొట్టుకున్న అన్న దమ్ములు పెద్ద అయ్యాక, ఆమె బరువు బాధ్యతలు మోయాల్సి వచ్చినపుడు మీ అమ్మ..మీ అమ్మ అంటూ వంతులు వేసుకుంటారు. చెప్పుకోవడానికి చాలా  కష్టం గా అనిపిస్తున్నా.. ఇది పచ్చి నిజం.

8 then and now

#9. ఒకప్పుడు మనుషులు వేసుకునే దుస్తులు చాలా నిండుగా శరీరాన్ని కప్పుతూ ఉండేవి.. ప్రస్తుతం పూర్తి స్థాయి లో కాకపోయినా, దుస్తుల వ్యవహారం లో కొంత హుందాతనం తగ్గినట్లే కనిపిస్తోంది.

9 then and now

#10. ఒకప్పుడు ఎవరైనా ప్రమాదం లో పడితే, ముందు చుట్టూ ఉన్నవాళ్ళని పిలవడం, చేతనైనంత వరకు సాయం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు.. కానీ, ఇప్పుడు..? వీడియో లు తీసుకుంటూ కూర్చుంటున్నారు. ఎంత మెటీరియలిస్టిక్ అయిపోయాయో కదా మన బతుకులు.

 then and now

.


End of Article

You may also like