ఈ 5 విషయాలను బిడ్డ తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిర్ణయించుకుంటాడు..! ఆ విషయాలు ఏమిటంటే..?

ఈ 5 విషయాలను బిడ్డ తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిర్ణయించుకుంటాడు..! ఆ విషయాలు ఏమిటంటే..?

by Anudeep

Ads

చాణిక్యుడు తన పుస్తకంలో జీవితంలోని ప్రతి ముఖ్యమైన అంశంపై జ్ఞానాన్ని అందించాడు. మన జీవితాన్ని సులభతరం చేయడానికి ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ కూడా మనం అనుసరిస్తున్నాం.

Video Advertisement

చాణిక్య నీతి ప్రకారం పిల్లలు పుట్టుకకు సంబంధించిన విషయాలు కూడా చెప్పుకొచ్చారు. బిడ్డ అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఈ 5 విషయాలు నిర్ణయించబడతాయి చాణిక్యనీతి లో చెప్పుకొచ్చారు.

మరి బిడ్డ నిర్ణయించుకుని ఆ అయిదు విషయాలు  ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం

#1. జీవితం :

చాణిక్య నీతి ప్రకారం బిడ్డ తల్లి కడుపులో ఉండగానే అతని జీవితం రాసిపెట్టి ఉంటుంది. అంటే ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు తన ఎంతకాలం, ఏవిధంగా జీవించాలి అనే విషయాన్ని నిర్ణయించుకుంటాడు.

#2.సంపాదన:

బిడ్డ పెరిగిన తర్వాత ఎంత డబ్బు సంపాదిస్తాడు అనేది కూడా తల్లి కడుపులోనే నిర్ణయిస్తుందని చాణిక్యుడు చెప్పాడు. పిల్లవాడు తన లక్షణాలతో ధనవంతుడు అవుతాడా లేదా కుటుంబాన్ని కష్టాల వైపు నడిపిస్తాడా అనేది బిడ్డ పుట్టక ముందే నిర్ణయించబడుతుంది.

#3.విద్య:

చాణిక్య నీతి ప్రకారం బిడ్డ ఎంత తెలివైనవాడు అనేది గర్భంలోని నిర్ణయించబడి ఉంటుంది. దీన్నిబట్టే బిడ్డ ఎలాంటి విద్యాబుద్ధులు అభ్యసించగలరు అనేది ముందుగానే తల్లి గర్భంలో నిర్ణయించబడి ఉంటుంది.

#4.మరణం:

చాణిక్య నీతి ప్రకారం బిడ్డ తల్లి గర్భంలోనే మరణాన్ని నిర్ణయించుకోగలడని చెబుతారు చాణిక్యుడు. వ్యక్తి యొక్క జీవితంలో మరణం అనేది వందసార్లు ఏర్పడుతుందని చాణిక్యుడు చెబుతున్నారు. అంటే దాని అర్థం, ఒకటి కాలం ద్వారా వచ్చే మరణం అయితే మిగతా మొత్తం అకాల మరణం.

#5. ప్రవర్తన :

చాణిక్య నీతి ప్రకారం బిడ్డవాడు తన తల్లి గర్భంలో ఉండగానే ఉత్తముడిగా ఎదగాలా లేదా పాపాత్ముడుగా జీవించాలా అనేది నిర్ణయించుకుంటాడు. అంటే సమాజంలో తాను ఏ విధంగా ప్రవర్తించాలి అనేది తల్లి కడుపులోనే బిడ్డ నిర్ణయించుకుంటాడు.


End of Article

You may also like