Ads
చాణుక్యుడు ఎంతటి మహాజ్ఞానో మనందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆర్థిక సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.
Video Advertisement
ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. వాటిని తరువాతి తరానికి కూడా అందచేసి.. మంచి భవిష్యత్ ను రూపొందించుకునేలా తోడ్పడాలి. చాణిక్య నీతి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెబుతోంది.
చాణక్య నీతి ప్రకారం మూడు రకాల స్వభావాలు కలిగి ఉన్న వ్యక్తులకు ఎప్పటికి సాయం చేయవద్దని చాణుక్యుడు చెబుతున్నాడు. నిజానికి చాణుక్యుల వారు స్నేహశీలి. ఆయన చంద్రగుప్త రాజుకు సైతం ఎన్నో సాయాలు చేసారు. యుద్ధ రంగంలోనూ, శత్రువులతోను ఎలా మెలగాలో మెళకువలు నేర్పించారు. అటువంటి చాణుక్యుడు కూడా మీ జీవితంలో ముగ్గురు వ్యక్తులకు మాత్రం ఎప్పుడూ సాయం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. వారు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
#1. తెలిసి తప్పులు చేసేవారు:
కొంత మంది కావాలనే తప్పులు చేస్తూ ఉంటారు. తాము తప్పులు చేస్తున్నామని తెలిసి కూడా తప్పులు చేయడానికి వెనకాడరు. అలాంటివారికి ఎప్పుడూ సాయం చేయవద్దని చాణుక్యుడు చెబుతున్నారు. ఎందుకంటే వారికి సాయం చేయడం వలన, వారు చేసే తప్పుల వల్ల మీరు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.
#2. ఏడుస్తూ ఉండేవారు:
కొందరు వ్యక్తులు ఎల్లప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. కారణం ఉన్నా లేకున్నా.. వీరి ఏడుపుకి అంతం ఉండదు. అయినదానికీ , కానిదానికీ ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి వారికి సాయం చేసినా.. వారు కృతజ్ఞత చూపించకపోగా.. ఇంకా ఏమి చేయలేదుగా అంటూ ఏడుస్తూనే ఉంటారు. ఇలాంటి వారికి కూడా దూరంగా ఉండడమే మంచిది.
#3. మూర్ఖులు:
కొందరు మూర్ఖంగా వాదన చేయడమే పనిగా పెట్టుకుంటారు. పరిస్థితులను పట్టించుకోకుండా.. సందర్భాన్ని గమనించుకోకుండా వాదించే ఇలాంటి మూర్ఖులకు సాయం చేయడం కూడా ఇబ్బందులను కొని తెచ్చుకోవడమే అవుతుంది. అందుకే ఇలాంటివారికి కూడా దూరంగా ఉండాలని చాణుక్యుడు హెచ్చరిస్తున్నారు.
End of Article