బ్రాండెడ్ వి కొనేటప్పుడు… నకిలీదో కాదో తెలుసుకోడానికి 7 విషయాలను గుర్తుపెట్టుకోండి.!

బ్రాండెడ్ వి కొనేటప్పుడు… నకిలీదో కాదో తెలుసుకోడానికి 7 విషయాలను గుర్తుపెట్టుకోండి.!

by Megha Varna

ఈ మధ్యకాలంలో నకిలీ ప్రొడక్ట్స్ విపరీతంగా ఎక్కువైపోతున్నాయి. నిజానికి బ్రాండెడ్ వస్తువులు ఏవీ..?, నకిలీ వస్తువులు ఏవి అనేది కనిపెట్టడం కష్టం అవుతోంది. అయితే మీరు కనుక కాస్త దగ్గరగా వాటిని పరిశీలించి చూస్తే తప్పకుండా మీకు ఏదో బ్రాండెడ్ వస్తువు ఏదో నకిలీది అనేది తెలిసిపోతుంది. అయితే అలా మీరు కనిపెట్టడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1. లోగో ఎలా ఉంటుందో చూడండి:

ఎప్పుడైనా మీరు గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలంటే గ్యాడ్జెట్ మీద లోగో ఎలా ఉంటుందో చూడండి. లోగో ద్వారా మీరు ఈజీగా కనిపెట్టొచ్చు. లోగో తప్పుగా ప్రింట్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు చూడండి.

Also Read:  అబ్బాయిలూ.. ఊరగాయలు ఎక్కువగా తింటున్నారా..? దాని వల్ల వచ్చే సమస్యలు తెలిస్తే ఇంకెప్పుడూ తినరు..!

Also Read:  మోచేతికి ఒకోసారి సడన్ గా ఏదైనా తగిలితే “షాక్” కొట్టినట్టు ఎందుకు అనిపిస్తుందో తెలుసా.?

#2. వాచీలు యొక్క మెటల్ మరియు సౌండ్ చూడండి:

ఎప్పుడైనా మీరు ఖరీదైన వాచీని కొనుగోలు చేయాలంటే దానికి సౌండ్ ఉండ కూడదు. మీ చెవిని వాచీ కి దగ్గరగా పెట్టి వినండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది. అలానే నకిలీ వాచీలు ఎప్పుడు తేలికగా ఉండే మెటల్ తో చూస్తూ ఉంటారు.

#3. షూ మీద కుట్లని చూడండి:

మంచి నాణ్యత ఉన్న షూ ఎప్పుడూ కూడా అందమైన స్టిచ్చింగ్ తో ఉంటుంది. అలానే కుట్టు చాలా దగ్గరగా ఉంటుంది. ఎక్కువ కుట్లు కూడా ఉంటాయి. ఒక స్క్వేర్ ఇంచ్ కి ఒరిజినల్ ప్రొడక్ట్స్ మీద ఎన్నో కుట్లు ఉంటాయి.

#4. ట్యాగ్ ని చూడండి:

బట్టలు కొనుగోలు చేసేటప్పుడు దాని మీద ఉండే ట్యాగ్ ని చూడండి. లేబుల్స్ ని చాలా అందంగా కొడతారు. కాస్ట్లీ ప్రొడక్ట్స్ మీద ప్రింటింగ్ యొక్క క్వాలిటీ కూడా బాగుంటుంది. సీరియల్ నెంబర్ సైజు మొత్తం అన్నీ కూడా మీరు పరిశీలిస్తే తెలిసిపోతుంది.

#5. ప్యాకింగ్ ని చూడండి:

మీరు ఎప్పుడైనా కాస్మెటిక్స్ ని కొన్నారంటే దానికి కవర్ ని గట్టిగా కట్టేసి ఉంటుంది. అలానే మంచి క్వాలిటీ ప్లాస్టిక్ ని వాడతారు. అలానే షేడ్ వంటి వివరాలని కూడా రాసి ఉంచుతారు.

#6. బటన్స్ ని చూడండి:

ఏదైనా కోట్ లాంటివి మీరు కొనుగోలు చేసినప్పుడు బటన్స్ ని చూడండి. మంచి ప్లాస్టిక్ ను ఉపయోగిస్తారు. అలానే గట్టిగా కుట్టేసి ఉంటుంది.

#7. బ్రైట్ నెస్ ని చూడండి:

మీరు ఏదైనా మంచి కాస్ట్లీ ఫోన్ కొనుక్కొనేటప్పుడు ఆన్ చేసాక బ్రైట్నెస్ చూడండి. పిక్చర్ ఎప్పుడూ కూడా బ్లర్ గా ఉండకూడదు. ఇలా మీరు నకిలీ ప్రొడక్ట్స్ ని కనిపెట్టొచ్చు.

Also Read:  ఇతర హీరోల ఈవెంట్స్‌లో … వారినే “డామినేట్” చేసిన 10 స్టార్ హీరోస్..!


You may also like