హనుమాన్ సినిమాని పొగిడిన చిలుకూరు బాలాజీ అర్చకుడు….!

హనుమాన్ సినిమాని పొగిడిన చిలుకూరు బాలాజీ అర్చకుడు….!

by Mounika Singaluri

Ads

హైదరాబాదులో ఉన్న ప్రముఖ ఆలయం చిలుకూరు బాలాజీ ఎంత విశిష్టత చెందిందో అందులో ఉండే ప్రధాన అర్చకుడు రంగరాజన్ కూడా అంతే ఫేమస్. ఆయన మాటలు చాలా చమత్కారంగా సూటిగా ఉంటాయి. ఆలయం వద్ద అయినా సరే బయట అయినా సరే ఏదైనా విషయమైనా స్పందించారంటే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు. చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయన తారాసపడతారు.

Video Advertisement

అయితే తాజాగా ఆయన హనుమాన్ సినిమా టీం నిర్వహించిన సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్ లో సక్సెస్ మీటి ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రంగరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హనుమాన్ సినిమా చూసిన తర్వాత తన నోట మాట రాలేదని అన్నారు.తన నామాన్ని జపిస్తే బుద్ధి, బలం, ధైర్యం, నిర్భయత్వాన్ని శ్రీరామభక్త ఆంజనేయస్వామి ప్రసాదిస్తారు. ప్రేక్షకులంతా ఆయన్ని తలచుకునేలా చేసిన ఈ చిత్రబృందానికి నా కృతజ్ఞతలు అని అన్నారు.

ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్లను వక్రీకరిస్తూ చూపిస్తేనే సినిమాలో హిట్ అవుతాయి అనే వాటికి హనుమాన్ సినిమా ఒక చెంపపెట్టు లాంటిది చెప్పుకొచ్చారు. ఈ సినిమా పైన ఎంతో రీసర్చ్ చేసిన ప్రశాంత వర్మ సోదరికి అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం రోజుల్లో సినిమా అనేది కీలక మద్యంగా మారిందని సమాజానికి ఉపయోగపడే సినిమాలను చూపించాలని అన్నారు. ఇప్పుడు రంగరాజన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.


End of Article

You may also like