Ads
సాధారణంగా భూలోకంలో ప్రాణాలు తీసే యముడికి, తల రాతలు రాసే బ్రహ్మ దేవుడికి గుళ్ళు గోపురాలు తక్కువే. అంతటి బ్రహ్మ దేవుడికే భూలోకంలో ఒకటో రెండో దేవాలయాలు ఉన్నాయి. భృగు మహర్షి శాపం కారణంగానే బ్రహ్మ దేవుడికి భూలోకంలో పూజలు లేవని అంటూ ఉంటారు.
Video Advertisement
అయితే.. యముడిని పూజించే వారు కూడా తక్కువే. ఆయన అంటే భయపడే వారే ఎక్కువ మంది ఉంటారు. ఆయన వద్ద పని చేసే చిత్ర గుప్తుల వారి గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది.
ఆయన మనుషుల పాప పుణ్యాల చిట్టాను రాస్తూ ఉంటారు. టాలీవుడ్ లో వచ్చిన యమలీల తరహా సినిమాల పుణ్యమా అని చాలా మందికి చిత్ర గుప్తుడి గురించి తెలిసింది. అయితే.. ఆయనకు కూడా భూలోకంలో ఓ గుడి ఉంది అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆయనకు ఒకే ఒక్క గుడి ఉంది. అది కూడా మన తెలంగాణ లోనే ఉంది.
తెలంగాణాలో హైదరాబాదులో ఫలక్ నామా లోనే ఆ గుడి ఉంది. ఈ గుడిని 18 వ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. నవాబుల కాలం లో గుమాస్తాలుగా పని చేసేవారు ఎక్కువగా చిత్రగుప్తుడిని కొలుస్తూ ఉండేవారట. వారి కోసమే అప్పటి మంత్రి అయిన రాజా కిషన్ గారు చిత్ర గుప్తుడి దేవాలయాన్ని కట్టించారట. అదే దేవాలయంలో చిత్ర గుప్తుల వారి భార్యలు అయిన శోభా దేవి, నందినిల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారట.
చిత్ర గుప్తుడిని రాహు, కేతు గ్రహాలకు గురువుగా భావిస్తారట. ఆయనను మనసారా పూజిస్తే గ్రహ దోషాలు తొలగి సుఖ శాంతులతో జీవిస్తారట. ఏడు బుధవారాల పాటు ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తే మనం కోరుకున్నవి జరుగుతాయని విశ్వసిస్తారు. హైద్రాబాదులో ఉన్న ఈ దేవాలయంలో గురు, బుధ వారాల్లో విశేషంగా భక్తుల హడావిడి ఉంటుంది. ఆరోజుల్లో ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయట.
End of Article