Ads
సాధారణం గా కాఫీ తక్కువ ధరలోనే దొరుకుతుంది. ఇండియా లో అయితే పది, పన్నెండు రూపాయలకు దొరుకుతుంది.. అదే ఇతర దేశాల్లో అక్కడ కరెన్సీ ని బట్టి లభ్యమవుతుంది. కానీ, ఓ హోటల్ లో మాత్రం మీ మ్యానెర్స్ ను చూసి బిల్ వేస్తారట. కస్టమర్ బిల్ అడిగే విధానాన్ని బట్టి ఛార్జ్ చేయడం జరుగుతుందట.
Video Advertisement
లా పెటిట్ సిరా (LA PETITE SYRAH ) అనే ఈ రెస్టారెంట్ లో ఇలా కాఫీ కి డిఫరెంట్ ప్రైస్ లు ఉంటాయట. ఈ రెస్టారెంట్ ఫ్రాన్స్ లో ఉంది. ఆ రెస్టారెంట్ కి వచ్చిన కస్టమర్లను బట్టి, వారి బిహేవియర్ ను బట్టి బిల్ ను కూడా ఛార్జ్ చేస్తారట. ఒకవేళ.. ఒక కస్టమర్ మొరటు గా కాఫీ తీసుకురా అంటూ ఆర్డర్ వేస్తె.. అక్కడి కరెన్సీ ప్రకారం 7.5 యూరోలు ఛార్జ్ చేస్తారట.
అలా కాకుండా, మాములుగా.. నాకు ఒక కాఫీ తీసుకురండి అని మర్యాద గా అడిగితె.. వారికి 4.25 యూరోలు ఛార్జ్ చేస్తారట. ఇలా కాకుండా.. రెస్టారెంట్ లోని సర్వర్లకు కూడా మర్యాదను ఇచ్చి.. మిత్రుడా..! నాకొక కాఫీ ఇస్తావా అంటూ ప్రేమ పూర్వకం గా అడిగిన వారికి 1.4 యూరోలు మాత్రమే ఛార్జ్ చేస్తారట. విచిత్రం గా ఉంది కదా.. కానీ సాటివారితో మర్యాదగా మెలగాలి అన్న విషయమే వారికి ముఖ్యమట. అది అందరిలోనూ కలిగించడం కోసం వారు చేస్తున్న ఈ ప్రయత్నం బాగుంది కదా..]
End of Article