“ప్రేమించడానికి ఇవన్నీ అవసరమా..?” అంటూ… నెటిజన్ పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“ప్రేమించడానికి ఇవన్నీ అవసరమా..?” అంటూ… నెటిజన్ పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

ఇటీవ‌ల కాలంలో డేటింగ్ యాప్స్ ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. వీటిలో కూడా ఇన్‌స్టాగ్రాం, ట్విట్ట‌ర్ లాగానే  వ్య‌క్తిగ‌త ఇష్టాలు, వ‌య‌సు వంటి వాటిని పొందుప‌రిచే బ‌యో కూడా ఉంటుంది.

Video Advertisement

అయితే ఒక వ్యక్తి తన టెన్త్‌, ఇంట‌ర్‌ వంటి వాటిలో వ‌చ్చిన మార్కులను రాశాడు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.అప్పట్లో ఎవరినైనా ప్రేమించాలంటే వారి చుట్టూ ఉన్న వాళ్లు, లేదా పరిచయం ఉన్నవారు మాత్రమే కనిపించేవారు.

i found my love after marrigae..

కానీ స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రస్తుతం ప్రపంచం చాలా చిన్నగా మారింది. ఎంత చిన్నగా అంటే మన అరచేతిలో ఇమిడే అంత. మనం ఉన్నచోటు నుండే మరో దేశంలో ఉన్న అమ్మాయితో లేదా అబ్బాయితో చాటింగ్ చేయవచ్చు. అయితే సోషల్ మీడియా అనేది వేరు. ప్రస్తుతం ప్రేమకు, డేటింగ్ కు ప్రత్యేకమైన యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇందులో ఒక వ్యక్తి యొక్క వ్య‌క్తిగ‌త ఇష్టాలు, వ‌య‌సు, హాబీలు మరియు వారు ఇత‌రుల్లో ఏం ఆశిస్తున్నారు లాంటి వివ‌రాలను నమోదు చేసే బ‌యో ఉంటుంది. ఈ యాప్స్ లో బయో లేదా ప్రొఫైల్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇష్టపడిన వారు ఆ ప్రొఫైల్ ను లైక్ చేయవచ్చు. ఈ క్రమంలో ఒక వ్యక్తి  డేటింగ్ యాప్ బ‌యోలో తన పదవ తరగతి, ఇంట‌ర్‌, జేఈఈలో వ‌చ్చిన మార్కులు మరియు ర్యాంకుల వివ‌రాల‌ను నమోదు చేశాడు.
అయితే అతను నమోదు చేసిన ఈ వివ‌రాల‌ స్క్రీన్ షాట్‌ను ట్విట్ట‌ర్‌లో ఇండియ‌న్ చాన్ అనే పేజ్లో షేర్ చేశారు. ఇందులో అంకిత్ ఝా అనే 24 ఏళ్ల యువ‌కుడు త‌న ప్రొఫైల్ లో విద్యార్హ‌తల గురించి చెప్పినట్లు కనిపిస్తోంది. బ‌యోలో ఉన్న వివ‌రాల ప్ర‌కారం అంకిత్ ఝా ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్, అత‌ను ఇన్ఫోసిస్‌ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నెటిజ‌న్ల నుంచి ఈ పోస్ట్‌కు ఊహించని స్పంద‌న ల‌భించింది.

Also Read: ఫుడ్ డెలివరీ చేయడానికి తన భార్యని కూడా తీసుకెళ్తాడు..? కంటతడి పెట్టిస్తున్న వీరి కథ..!


End of Article

You may also like