“త్రివిక్రమ్” దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లో వుండే… “కామన్ పాయింట్” ఏమిటో తెలుసా..?

“త్రివిక్రమ్” దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లో వుండే… “కామన్ పాయింట్” ఏమిటో తెలుసా..?

by Megha Varna

Ads

త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. సినీ మాటల రచయితగా, కథా రచయితగా, దర్శకుడిగా పేరు పొందారు త్రివిక్రమ్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంవరం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు చిత్రాలకి కథ, స్క్రీన్ ప్లే, రచయితగా వ్యవహరించారు.

Video Advertisement

ఆ తరవాత అతడు, జులాయి, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో వంటి సినిమాలకు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో పేరు పొందారు.

ఇవి కూడా చదవండి: వైరల్ అవుతున్న ఆన్సర్ పేపర్..! పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటూ కామెంట్స్ పెడుతున్న నెటిజన్లు..!

అయితే త్రివిక్రమ్ సినిమాలో చాలా కామన్ గా మనం ఒకటి గమనించవచ్చు. అదేంటంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లో కూడా హీరో డైరెక్ట్ గా విలన్ ని చంపడు. కేవలం ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా లో మాత్రమే డైరెక్ట్ గా హీరో విలన్ ని చంపుతాడు.

ఇది మనం త్రివిక్రమ్ దర్శకత్వం లో గమనించవచ్చు. అతడు సినిమా చూసుకున్నట్లయితే అతడు సినిమాలో మహేష్ బాబు విలన్ ని చంపడు. ఆ తుపాకీలో బుల్లెట్స్ వుండవు. గోళీ ఉంటుంది. అలానే జల్సా సినిమాలో అయితే పక్కన ఉన్న కత్తి మీద కాలు వేస్తే విలన్ కి హార్ట్ ఎటాక్ వస్తుంది. అంతే కానీ జల్సా లో పవన్ కళ్యాణ్ విలన్ ని చంపడు.

ఇక జులాయి సినిమాలో కూడా సోనూసూద్ ని అల్లు అర్జున్ కాల్చడు. రాజేంద్ర ప్రసాద్ సోనూసూద్ ని గన్ తో షూట్ చేస్తాడు. పైగా అల్లు అర్జున్ ఇప్పుడు చంపి జైలుకి వెళ్తామా అని కామెడీ చేస్తాడు. ఇలా దాదాపుగా అన్ని సినిమాల్లో కూడా డైరెక్ట్ గా హీరో విలన్ ని చంపడు. కేవలం ఒక్క అరవింద సమేత వీర రాఘవ లో మాత్రమే డైరెక్టుగా ఎన్టీఆర్ విలన్ ని చంపుతాడు.

ఇవి కూడా చదవండి: “కళ్యాణ్ రామ్” భార్య స్వాతి గురించి… ఈ విషయాలు తెలుసా..?


End of Article

You may also like