బాలయ్య వ్యాఖ్యాతగా ఆహాలో అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ షో లో ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు గెస్టులు గా పాల్గొన్నారు. కాగా ఈ షో కి సంబంధించిన తాజా ప్రోమో ఒకటి రిలీజ్ చేసారు. ఇందులో గెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

Video Advertisement

సాధారణం గా ప్రభాస్ ఇలాంటి టాక్ షోలకు దూరంగా ఉంటాడు. తన సినిమా ఈవెంట్లకు తప్ప వేరే వాటికీ రారు. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రభాస్ ఫస్ట్ సీజన్ లోనే రావాల్సింది. కానీ బిజీ షెడ్యూల్స్ కారణం గా కుదరలేదని సమాచారం.. మొత్తానికి ప్రభాస్ కి ఇప్పుడు కుదిరింది.

 

did you the cost of tthe shirt that prabhs wore on bala krishna show..??
అయితే ఈ షో లో పాల్గొన్న కొందరు ఫాన్స్ రిలీజ్ చేసిన ఫొటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇందులో ప్రభాస్ ని చూసిన ఫాన్స్ షాక్ అవుతున్నారు. గత కొంత కాలం గా ప్రభాస్ తలకు క్యాప్, కళ్ళ జోడు లేకుండా కనిపించట్లేదు. కానీ ఈ షో లో ప్రభాస్ ఎల్లో బ్లూ మల్టీ కలర్ షర్ట్ వేసుకొని.. సింపుల్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు.

did you the cost of tthe shirt that prabhs wore on bala krishna show..??

దీంతో ప్రభాస్ లుక్ పై ఫాన్స్ నెట్టింట సెర్చ్ చెయ్యగా.. రెబల్ స్టార్ వేసుకున్నది.. ‘‘పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్’’ ..దీని కాస్ట్ 115 పౌండ్స్.. మన ఇండియన్ కరెన్సీలో 11,618.09 రూపాయలు అని తెలిసి షాక్ అవుతున్నారు ఫాన్స్.. ఈ షో లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా కలిసి పాల్గొన్నాడు. పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్, బాల కృష్ణ, గోపిచంద్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ అందరూ ఈ ఎపిసోడ్ ప్రోమో, స్ట్రీమింగ్ డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.