Ads
కాకులు సాధారణంగా ఇళ్లపైన, ఇంటి ముందు తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కాకులు ఇంటి పై వాలి అరుస్తుంటాయి. అలా కాకి ఇంటి పైన అరిస్తే ఆ ఇంటికి బంధువులు వస్తారని పెద్దలు అంటుంటారు. కాకులు మనుషుల జీవితంలో జరగబోయే మంచి, చెడులను అంచనా వేయగలవని శాస్త్రం చెప్తోంది. నిజానికి కాకులను ఏ సమయంలో చూస్తే మంచిది. ఏ సమయంలో చూస్తే చెడు అనేది కూడా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ విషయల గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
విష్ణు పురాణంలో చెప్పిన ప్రకారం కాకిని పూర్వికుల గుర్తుగా విశ్వసిస్తారు. కాకిని పితృపక్షంలో చూడటం ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. ఇక పితృపక్షంలో భక్తితో ఆహారాన్ని కాకులకు పెడతారు. పితృపక్షంలో కాకి రూపంలో పూర్వికులు వస్తారని నమ్ముతుంటారు. సాధారణంగా కాకి ఇంటి పైన అరిస్తే ఆరోజు తమ ఇంటికి బంధువులు, లేదా స్నేహితులు వస్తారని విశ్వసిస్తారు. తెల్లవారుజామునే చాలా మంది తమ ఇంటిపైన కాకులకు ఆహారం సమర్పించి తమ దోషాలను పోవాలని ప్రార్దిస్తారు.
బయటకు వెళ్తున్న సమయంలో కాకి కుండలోని నీళ్లు తాగడం కనిపిస్తే వారికి త్వరలో ధనప్రాప్తి కలుగుతుందని అంటారు. అలాగే కాకి ఆహారాన్ని ముక్కుతో పట్టుకుని ఎగరడం కనిపిస్తే, శుభవార్తలు వింటారని భావిస్తారు. పగటి పూట ఉత్తరం వైపున లేదా తూర్పువైపున కాకులు అరిస్తే మంచిదని చెబుతుంటారు. కాకి ఎగిరే సమయంలో మనిషికి తాకితే శుభసూచకం అని, వారికి త్వరలో చాలా డబ్బు వస్తుందని నమ్ముతారు.
కానీ కాకి ఎగిరే సమయంలో తలకు తాకితే ఆ మనిషి శరీరం క్షీణిస్తుందని, ఆర్థికంగా నష్టాలు వస్తాయని, ఆయుష్షు తగ్గుతుందని చెప్తారు. కాకి ఎగురుతూ మనిషి పై రెట్ట వేస్తే చెడు జరుగుతుందని, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. తీవ్రమైన ఆర్థిక నష్టాలు వస్తాయని అంటున్నారు. చాలా కాకులు ఒక వైపునే కూర్చోవడం కనిపిస్తే రాబోయే రోజుల్లో ప్రమాదం రావచ్చని అర్థం. ఇంటి పై కాకులు పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఫ్యామిలికి గడ్డుకాలం రాబోతుందని, అంతే కాకుండా కాకులు చావు వార్తను తెస్తాయని విశ్వసిస్తూ ఉంటారు.
Also Read: ఎప్పుడూ మరచిపోయి కూడా ఈ 4 విషయాలని ఎవరికీ చెప్పద్దు… భార్యకి కూడా..!
End of Article