ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అంటూ తెలుగు లో ఓ సామెత ఉంది. దాని అర్ధం ఏమిటంటే.. పరిస్థితులు ఎప్పుడు ఒకలానే ఉండవని.. ఈరోజు ఉన్న అధికారం, ఆస్తి ఎప్పుడైనా చేయి దాటిపోవచ్చని చెప్పబోయే సందర్భాలలో ఈ సామెతను వాడతారు. ఒకప్పుడు మన దేశం లో రాజరికాలు నడిచేవన్న సంగతి తెలిసిందే. అప్పట్లో రాజ్యాలు ఏలిన వారి వారసులు ప్రస్తుతం అతిసామాన్యులు గా బతుకు వెళ్లదీస్తున్నారు. వారెవరో, వారి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..

#1 రాజ బ్రజరాజ్ క్షత్రియ బీర్బర్ చంపుటి సింగ్:

1 champuti sing
ఈయన ఒడిశా ను పరిపాలించిన చివరి పాలకుడు. ఆయన రాజభవనం 20 లగ్జరీ కార్లు, పనివాళ్ళతో కళకళలాడుతూ ఉండేది. కానీ స్వాతంత్య్రం తరువాత రాజ్యాలు పోవడం తో ఇతని పరిస్థితి దారుణం గా మారింది. అతను ఉంటున్న గ్రామం ప్రజలు ఇచ్చిన ఆహరం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య నుంచి విడిపోయి ఒంటరిగా కాలం గడుపుతున్నారు.

#2 గ్వాలియర్ కు చెందిన సింధియాలు:

2 sindhia
మహారాజా జయజిరాజా గ్వాలియర్ కు చెందిన సింధియా ను పాలించేవారు. ఆ సమయం లో వీరి రాజ్యం ఎంతో సుసంపన్నం గా ఉండేది. ఆయన ఖజానా నిండుగానే ఉండేది. ఎప్పుడైనా విపరీత పరిస్థితులు ఎదురైతే తప్ప ఖజానా నుంచి సొమ్ము వినియోగించాల్సిన అవసరం వచ్చేది కాదు. ఆయన మరణాంతరం ఖజానా కు చెందిన సొమ్ము గురించి కొడుకు మాధవరావు కు చెప్పలేకపోవడం తో ఆయన వారసులకు కష్టాలు తప్పలేదు. ఆయన కొడుకు మాధవరావు బాల్యం లో ఉండగానే.. జయాజీరాజా పరమపదించారు. కొడుకు మాధవరావు ప్రస్తుతం టాటా వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ జీవనాన్ని సాగిస్తున్నారు.

#3 టిప్పు సుల్తాన్ వారసులు:

3 tippu sulthan
టిప్పు సుల్తాన్ ను టైగర్ ఆఫ్ మైసూర్ అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. సుల్తాన్ లు చాలా ధైర్యవంతులు.. వారి పాలనలో రాజ్యం సుభిక్షం గా ఉండేది. అయితే, బ్రిటిష్ వారి చేతిలో టిప్పు సుల్తాన్ మరణించారు. ఆ తరువాత వారి ఆస్తులు గుల్హం మహమ్మద్ ట్రస్ట్ అధీనం లోకి వెళ్లాయి. ప్రస్తుతం సుల్తాన్ వారసులు రిక్షావాలాలు గా జీవనం సాగిస్తున్నారట.

#4 సఖినా మహల్ రాకుమారి:

4 sakhina
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఔద్ రాజవంశస్తుల రాకుమారి సఖినా. ఔద్ రాజవంశస్తులు ఢిల్లీ అడవుల్లో తలదాచుకున్నారని తెలుస్తోంది. సఖినా మహల్ మాత్రం తుగ్లక్ పాలకుల అధీనం లో ఉండాల్సొచ్చింది. ఆమె తొమ్మిదేళ్ల పాటు న్యాయ పోరాటం చేసిన తరువాత.. రాజ్ మహల్ ని వాడుకుంటున్నందుకు గాను ప్రభుత్వం ఆమెకు నెలకు 500 రూపాయలు ఇచ్చేలా తీర్పు చెప్పింది.

#5 ఉత్రడం తిరుణాల్ మార్తాండవర్మ:

5 utradam
ఉత్రడం తిరుణాల్ మార్తాండవర్మ ట్రావెల్ సోర్ సామ్రాజ్యానికి అధిపతి. వీరికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ గా ఉండేవి. అనంతపద్మనాభ స్వామి వారిని వీరి ఇంటిదైవం గా కొలిచేవారు. వీరు పద్మనాభ స్వామికి అనేక కానుకలను సైతం ఇచ్చేవారు. పద్మనాభ ఆలయానికి, ఆస్తులకు ప్రభుత్వం రక్షణ కల్పించింది.. కానీ, ఆ రాజా వంశస్తులకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు.

#6 జుయాసిద్దీన్ టుసీ:

6 juyasiddin
జుయాసిద్దీన్ టుసీ మొగ్గలు చక్రవర్తులలో ఆఖరువాడు. ఆయన ప్రస్తుతం ఓ అపార్ట్ మెంట్ లో రెంట్ కి ఉంటూ.. తనకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తో జీవనం సాగిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నాల్లో ఉన్నారు.

#7 సుల్తానా బేగం:

7 sulthana begam
సుల్తానా బేగం బహదూర్ షా జాఫర్ మనవడు బేదర్ బుకుత్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే.. అతను మరణించాక ఆమె పేదరికం లోకి వెళ్ళిపోయింది. తన ఆరుగురు సంతానాన్ని.. ఓ రెండు గదుల ఇంట్లో అద్దెకు ఉంటూ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తో నెట్టుకొస్తోంది.

#8 ఉస్మాన్ అలీఖాన్:

8 usmanఉస్మాన్ అలీఖాన్ నిజాం పాలకుల్లో ఆఖరివాడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈయన ప్రపంచం లో ధనికుల్లో ఒకరిగా గుర్తింపు ను కూడా మూటగట్టుకున్నారు. ఇతనికి కామ కోరికలు ఎక్కువ గా ఉండడం వలన వందిమంది వరకు అక్రమ సంతానాన్ని కలిగి ఉన్నారు. దీనితో అతని ఆస్తి కర్పూరం లా కరిగిపోయింది. ఆయన వారసుల్లో ఒకరు మాత్రం ఇస్తాంబుల్ లో ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటూ.. డయాబెటిస్ తో బాధపడుతూ బలహీనం గా ఉన్నాడు.