తండ్రి కొడుకుల చాట్ ను షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు..వైరల్ అవుతోన్న ట్వీట్స్..!

తండ్రి కొడుకుల చాట్ ను షేర్ చేసిన సైబరాబాద్ పోలీసులు..వైరల్ అవుతోన్న ట్వీట్స్..!

by Anudeep

Ads

రోడ్డు మీద బండి నడిపేటప్పుడు ప్రతిక్షణం అప్రమత్తం గానే ఉండాలి. ఏ నిమిషం ఏమరుపాటు గా ఉన్నా ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ విషయం పై ట్రాఫిక్ నిబంధనలను కచ్చితం గా పాటించాలి అంటూ పోలీసులు నిత్యం హెచ్చరిస్తూనే ఉంటారు. ఈ ప్రచారం లో సైబరాబాద్ పోలీసులు ఓ అడుగు ముందే వున్నారు. వీరి సోషల్ మీడియా విభాగం చాలా ఆక్టివ్ గా ఉంటుంది. నిత్యం హెచ్చరికలతో అందరిని ఆకర్షించే విధంగా ట్వీట్లు చేస్తూ ఉంటుంది.

Video Advertisement

బండిపై వెళ్తున్నపుడు హెల్మెట్ ను తలకు పెట్టుకోకుండా బండి పైనే పెట్టుకుని పోలీసులు కనిపిస్తే అప్పుడు పెట్టుకుంటుంటాం. అలాంటి వారి కోసమే ఈ హెచ్చరిక. “హెల్మెట్ తాయత్తులా బండికి కడితే లాభం ఉండదు. హెల్మెట్ పెట్టుకోండి. సురక్షితంగా ఉండండి.”అంటూ హెచ్చరించారు.

ఓ పక్క జాగ్రత్తలు చెబుతూ, మరో వైపు నష్టాలు ఎలా వస్తాయో వివరించేలా వీరు ప్రకటనలు చేస్తూ ఉంటారు. తాగి బండి నడపడం నేరం. అలానే, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం కూడా నేరమే. ఇలాంటి వాటిని రోడ్డు పై గమనించి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ లు వేస్తూ ఉంటారు. అయితే, ఇవి మాములుగా చెప్తే ఎవరు వినరు. అందుకే సైబరాబాద్ పోలీసులు డిఫరెంట్ గా వాట్సాప్ స్క్రీన్ షాట్ లను షేర్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలను మీరు ఇక్కడ చూడండి.

 

 

అలాగే బండి నడుపుతున్నప్పుడు, మనం వేసే వేషాలను కూడా సైబరాబాద్ పోలీసులు గమనిస్తున్నారండోయ్.. దానికి ఈ ట్వీట్ఒక ఉదాహరణ. “చలానాలు తప్పించుకునేందుకు చేసే ప్రతి పని మీకు ప్రమాదకరంగా, ప్రతికూలంగా మారుతుంది.” అని జాగ్రత్తలు చెబుతున్నారు.

 

అలాగే, బండి కి వెనకాల కూర్చున్న వారు కూడా విధిగా హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తూ మరో స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసారు. “పార్టీ ఇవ్వడమే కాదు పార్టీకి వచ్చిన వారు క్షేమంగా ఇంటికి చేర్చే భాద్యత కూడా మీరే తీసుకోవాలి.. మద్యం సేవించి బండి నడపడం నేరం, ప్రమాదం. ” అని ట్విట్టర్ లో తెలిపారు.

 

పిల్లలకు బండి ఇస్తున్న తండ్రులకు కనువిప్పు కలిగించేలా ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేసారు. “క్యాప్ లాంటి, నాసిరకం హెల్మెట్లు వాడకండి. నాణ్యమైన ఐఎస్ఐ హెల్మెట్లు మాత్రమే కొనండి. సురక్షితంగా ఉండండి. పిలియన్ రైడర్ కి కూడా నాణ్యమైన హెల్మెట్లనే కొనండి.” అంటూ హెచ్చరిస్తున్నారు.

అలాగే మరొక స్క్రీన్ షాట్.. “మీ పిల్లలు బండి నడిపే ప్రవర్తనపై నిఘా పెట్టండి.. వారు తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతుంటే వారికి బండి ఇవ్వొద్దు..” అని రిక్వెస్ట్ చేస్తూ ఓ తండ్రి కొడుకుల మధ్య సంభాషణను సైబరాబాద్ పోలీస్ విభాగం ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేసింది. ఆ స్క్రీన్ షాట్ ను మీరు ఈ కింద చూడొచ్చు.

 

 


End of Article

You may also like