Ads
చిన్న పిల్లలు దైవ స్వరూపులు, అమాయకులు అని మనం భావిస్తూ ఉంటాము. వారికి ఏమి తెలియదు అని అనుకుంటూ ఉంటాం. కానీ వారు అబ్సర్వ్ చేసినంత లోతు గా మనం కూడా చెయ్యలేమేమో. ఇందుకు ఈ ఘటనే ఉదాహరణ. ఇది అర్ధం కావాలంటే.. ఈ స్టోరీ పూర్తి గా చదవండి.
Video Advertisement
ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న ఒక అబ్బాయి తన తల్లిని పోగొట్టుకున్నాడు. పిల్లవాడు చిన్న వయసు వాడు అవ్వడం తో.. అతని తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. మరొక అమ్మాయిని తీసుకొచ్చి.. నీకు కొత్త అమ్మ ని తీసుకొచ్చా.. అంటూ ఆ పిల్లాడి కి పరిచయం చేసాడు.
కొన్ని రోజుల తరువాత ఆ తండ్రి తన కొడుకు వద్దకు వెళ్లి.. పాత అమ్మకి, కొత్త అమ్మకి తేడా ఏంట్రా..? అని ప్రశ్నించాడు. దానికి ఆ కొడుకు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా..? “పాత అమ్మ అబద్ధం డాడీ.. కొత్త అమ్మ మాత్రం నిజం డాడీ” అని అన్నాడు.
దానికి షాక్ అయిన ఆ తండ్రి అదేంటి? అని ప్రశ్నించాడు. నేను ఎప్పుడైనా అల్లరి చేస్తే.. పాత అమ్మ వచ్చి ఇలా అల్లరి చేస్తే అన్నం పెట్టాను అనేది. కానీ.. ఆ తరువాత తానే వచ్చి తినిపించింది. ఈ కొత్త అమ్మ కూడా అల్లరి చేస్తే అన్నం పెట్టను అని చెప్పింది. నిజం గానే నాకు మూడు రోజుల నుంచి అన్నం పెట్టలేదు అంటూ ఆ కొడుకు సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం విన్న తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
End of Article