23, 24 తేదీల్లో దసరా పండగ ఎప్పుడు జరుపుకోవాలి…? పండితులు ఏం చెప్తున్నారు అంటే..?

23, 24 తేదీల్లో దసరా పండగ ఎప్పుడు జరుపుకోవాలి…? పండితులు ఏం చెప్తున్నారు అంటే..?

by Mounika Singaluri

Ads

 

తెలుగువారి పండగల్లో అతి ప్రాముఖ్యమైన పండుగ దసరా. ప్రతి వాడవాడలా అమ్మవారిని నిలబెట్టి శరన్నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు.

Video Advertisement

మహిళలు సౌభాగ్యంగా భావిస్తూ ఈ పూజకి అధిక ప్రాధాన్య ఇస్తారు. రోజుకో అవతారంలో అమ్మవారిని అలంకరించి విశిష్ట పూజలు చేస్తారు. ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత ఉంది. ఈ లోకాన్ని కాపాడే లోకమాతగా అమ్మవారిని భక్తులు కొలుస్తూ ఉంటారు.

అటువంటి దసరా పండుగ విషయంలో ఈ సంవత్సరం చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది. అధికమాసం కావడంతో ఈ సంవత్సరంలో ప్రతి పండుగ రెండు రోజుల్లో వచ్చింది. అలాగే దసరా కూడా 23న లేదా 24న అనే సందిగ్ధత ఏర్పడింది.విజయదశమి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే 23వ తారీఖున నవమి తిథి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. 24వ తారీఖున నవమి తిధి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంది. నిర్ణయ సింధు, ధర్మ సింధు ప్రకారం మధ్యాహ్నానికి దశమి తిధి ఉండే రోజున విజయదశమిగా జరుపుకోవాలని శాస్త్రం నిర్ణయించబడింది.

కాకపోతే 23, 24 తారీకుల్లో దశమి తిధి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రవణ యోగం ఉన్న రోజున పరిగణలోకి తీసుకోవాలి. ఆ లెక్కన చూస్తే 23 వ తారీఖున శ్రావణ యోగం ఉన్నది. కాబట్టి 23వ తారీకునే విజయదశమి పండుగ చేసుకోవాలని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 24వ తారీఖున మధ్యాహ్నం వరకు దశమి తిధి ఉన్నా కూడా పూర్వదినాన్ని గ్రహించాలని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే 23వ తారీకునే మహర్నవమి, అదే రోజు విజయదశమి కూడా జరుపుకోవాలని పురోహితులు చెబుతున్నారు.

 

Also Read:హీరోయిన్ “కుష్బూ” కి ఈ గుడి వాళ్ళు పూజ ఎందుకు చేసారు..? అసలు విషయం ఏంటంటే


End of Article

You may also like