ధోనీ తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్లే CSK గెలిచిందా.?

ధోనీ తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్లే CSK గెలిచిందా.?

by Mohana Priya

Ads

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిన్న జరిగిన మ్యాచ్ లో ఎవరూ ఊహించని విధంగా ప్లాన్ వేసి మ్యాచ్ గెలిచేలా చేశారు. అందరూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోతుంది ఏమో అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ధోనీ రెండు సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్ లో విజయం సాధించడానికి కారణం అయ్యాయని చెప్పొచ్చు. అవేంటంటే.decisions took by dhoni in csk vs mi ipl 2021

Video Advertisement

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ (88 నాటౌట్: 58 బంతుల్లో 9×4, 4×6)  హాఫ్ సెంచరీ చేయడంతో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు స్కోర్ చేసింది. సౌరభ్ తివారి (50 నాటౌట్: 40 బంతుల్లో 5×4) హాఫ్ సెంచరీ చేసిన కూడా ముంబై జట్టు 136/8 పరిమితం అయ్యింది. రుతురాజ్ గైక్వాడ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 157 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్ డికాక్ (17: 12 బంతుల్లో 3×4) మొదట చాలా దూకుడుగా ఆడుతున్నట్లు కనిపించారు.decisions took by dhoni in csk vs mi ipl 2021

దాంతో దీపక్ చాహర్ తో కలిసి స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేయించి గేమ్ ని ఒక మలుపు తిప్పారు ధోనీ. దీపక్ చాహర్ విసిరిన బంతిని లెగ్ సైడ్ హిట్ చేసేందుకు ఆఫ్ స్టంప్ లైన్ పైకి వెళ్ళిన డికాక్ వికెట్ల ముందు “ఎల్బీడబ్ల్యూ”గా దొరికారు. కానీ ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. బాల్ ఖచ్చితంగా వికెట్లను తాకింది అని నిర్ధారించుకున్న ధోని డీఆర్ఎస్ కోరారు. రిప్లై చేసిన తర్వాత ఫీల్డ్ అంపైర్ నాటౌట్ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ కి మొదటి దెబ్బ ఇది.

decisions took by dhoni in csk vs mi ipl 2021

ముంబై ఇండియన్స్ జట్టు తాత్కాలిక కెప్టెన్  కీరన్ పొలార్డ్‌ వికెట్ కోసం  జోష్ హేజిల్‌వుడ్ చేతికి బంతిని ఇచ్చారు. అప్పటికే 2 ఓవర్లు వేసిన  జోష్ హేజిల్‌వుడ్ 26 పరుగులు ఇచ్చారు. కానీ ధోనీ మాత్రం మళ్లీ అతనికే బంతిని ఇచ్చారు. వికెట్ల ముందు కాస్త మెల్లగా కదులుతున్న పొలార్డ్‌ ని వేగవంతమైన డెలివరీతో ఎల్బీడబ్ల్యూగా హేజిల్‌వుడ్  అవుట్ చేశారు. అవుట్ నుండి తప్పించుకునేందుకు డీఆర్ఎస్ కి వెళ్లారు. కానీ అక్కడ కూడా ఫలితం దక్కలేదు. అలా ధోనీ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు టీం గెలవడానికి ముఖ్య పాత్ర పోషించాయని చెప్పవచ్చు.


End of Article

You may also like